ఆంధ్రప్రదేశ్‌

తెలుగు కోసం ఉద్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 13: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా రద్దు చేసి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను తక్షణం రద్దు చేయాలని కోరుతూ మాతృభాషా వేదిక ఈ నెల 17వ తేదీ విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని తెలుగుతల్లి విగ్రహం వద్ద ఉద్యమ దీక్ష చేపట్టనుంది. రాష్ట్రంలో మాతృభాష తెలుగు పరిరక్షణ కోసం గత కొన్ని దశాబ్దాలుగా పని చేస్తున్న 38 సంస్థలు ఏకమై మాతృభాషా వేదిక పేరిట తొలిదశగా ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ వేదికకు సారథ్య కమిటీ సభ్యులుగా పీడీఎఫ్ ఫ్లోర్‌లీడర్ విఠపు బాల సుబ్రహ్మణ్యం, తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్‌బాబు, విద్యా పరిరక్షణ వేదిక కన్వీనర్ రమేష్ పట్నాయక్, జన సాహితీ నాయకులు దివి కుమార్, విద్యావేత్త పరిమి వ్యవహరిస్తున్నారు. ఇక రెండో దశలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు, పాఠశాలల్లో ప్రచార కార్యక్రమాలు, సంతకాల సేకరణ ప్రారంభించబోతున్నామని తెలుగు భాషోధ్యమ సమితి రాష్ట్ర కార్యదర్శి కంచర్ల సుబ్బానాయుడు తెలిపారు. 17వ తేదీ విజయవాడ నగరంలో తెలుగు తల్లి విగ్రహం నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. తదుపరి రాష్టబ్రంద్‌కు పిలుపునిస్తామన్నారు. ఆంగ్ల భాష అవసరాల దృష్ట్యా తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టవచ్చుగాని అసలు మాతృభాష మధ్యమానే్న పూర్తిగా రద్దు చేయటం సమంజసం కాదన్నారు.