ఆంధ్రప్రదేశ్‌

బాబు దీక్షకు మద్దతు కోసం పవన్‌తో టీడీపీ నేతల చర్చలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 13: ఇసుక కొరతకు నిరసనగా, భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు గురువారం చేపట్టే 12 గంటల దీక్షకు అందరూ మద్దతివ్వాలని ఆ పార్టీ నేతలు కోరారు. ఈ మేరకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ను బుధవారం ఆయన నివాసంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య కలిసి మద్దతు కోరారు. కాగా చంద్రబాబు దీక్షకు పవన్ సంఘీభావం తెలిపారు. దీక్షకు జనసేన పార్టీ నేతలు హాజరవుతారని పవన్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి పోయేకాలం దాపురించిందని దుయ్యబట్టారు. పాలనలో ఓ విధానం లేకుండా రాష్ట్రాన్ని అన్నివిధాలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. సీఎం ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగట్టేందుకు అన్ని వర్గాలు, పార్టీలు, ప్రజా సంఘాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రభుత్వాలు మారటమనేది సహజమని అయితే, రాష్ట్రాన్ని ఎవరూ బాగుచేయలేని రీతిలో జగన్ పాలన ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో పౌరులకు ప్రశ్నించే హక్కు ఉందని, వారి సూచనలు, సలహాలను సహృదయంతో స్వీకరించలేని నిర్లక్ష్య స్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. పవన్‌కల్యాణ్ తెలుగు భాష గురించి ప్రస్తావిస్తే రాష్ట్ర మంత్రులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఆయనపై వ్యక్తిగత దూషణలు చేయటం దౌర్భాగ్యమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యను గుర్తించకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన వారిపై ఎదురుదాడికి దిగుతున్నారని ఆరోపించారు. ఒకవైపు ఇసుక కొరత, మరోవైపు తెలుగు భాష మనుగడ, అమరావతి స్టార్టప్ ఏరియా ప్రాజెక్ట్ నుంచి సింగపూర్ వైదొలగటం ఇలా అనేక సమస్యలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దీక్షకు సీపీఐ, సీపీఎం, లోక్‌సత్తా, కాంగ్రెస్, బీజేపీ, జనసేన పార్టీల మద్దతు కోరామన్నారు. ఇసుక కొరత కారణంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 45 మందికి పైగా ఆత్మహత్యలు చేసుకున్నారని అయినా ప్రభుత్వంలో చలనం రాలేదని వర్ల రామయ్య ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించక పోవటం దారుణమన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.