ఆంధ్రప్రదేశ్‌

గాడిదలతో ఇసుక రవాణా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదోని: ఇసుక బంగారంగా మారిన ప్రస్తుత తరుణంలో కర్నూలు జిల్లా ఆదోనిలో రజకులు గాడిదలపై తరలిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇసుకపై నిషేధం కొనసాగుతున్నందున పెద్దమొత్తంలో దొరకడం దుర్లభమైంది. దీంతో ఆదోనిలో కొంతమంది రజకులు సమీపంలోని కాలువలు, నదుల నుంచి గాడిదలపై ఇసుక తెచ్చి పట్టణంలో విక్రయిస్తున్నారు. మధ్యలో పనులు ఆగిపోయిన భవన యజమానులు తప్పినిసరి పరిస్థితుల్లో ఈ ఇసుక కొనుగోలు చేస్తున్నారు. గాడిదలపై తెచ్చే ఇసుకను రూ.300కు విక్రయిస్తున్నారు. గతంలో రూ.150కే అమ్మేవారు. అయితే ప్రస్తుతం బయట ఇసుక దొరక్కపోవడంతో గాడిదల ఇసుకకు డిమాండ్ పెరిగింది. వాహనాల్లో ఇసుక తరలింపుపై ప్రభుత్వం అంక్షలు పెట్టడం, ట్రాక్టర్లను పోలీసులు పట్టుకుని భారీ మొత్తంలో జరిమానా విధిస్తుండడంతో ఆదోని పట్టణంలో గాడిదలపై ఇసుక రవాణా చేస్తూ భవన నిర్మాణాలను సాగిస్తున్నారు. గాడిదలపై తెచ్చే ఇసుక కొనుగోలు చేయడం వల్ల భవన యజమానులకు అధిక భారం అవుతోంది. అయినప్పటికీ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వస్తోందంటున్నారు.
ఇసుక తరలింపుపై ప్రభుత్వం అంక్షలు పెట్టింది. ఆదోని పట్టణ సమీపంలో ఇసుక రీచ్‌లను ప్రభుత్వం గుర్తించలేదు. దీంతో ఆదోని పట్టణంలో ఇసుక కావాలంటే అక్కడకక్కడ ఉన్న వంకలు, వాగులు, చెరువుల నుంచి గాడిదలపై ఇసుక తెచ్చి విక్రయిస్తున్నారు.
ఆదోనిలో గాడిదపై ఇసుక విక్రయాలు ఈనాటివి కావు. గతంలో ఎర్రమట్టి, ఇసుక గాడిదలపై వేసుకుని ఇళ్లిల్లూ తిరిగి విక్రయించేవారు. ట్రాక్టర్లు రావడంతో వీటికి గిరాకీ తగ్గింది. అయితే ఇప్పుడు ట్రాక్టర్లు మూలనబడడంతో గాడిదపై తెచ్చే ఇసుకకు డిమాండ్ పెరిగింది. గతంలో ఒక గాడిదపై తెచ్చే ఇసుక రూ.150కు అమ్మగా ఇప్పుడు ఏకంగా రూ.300కు విక్రయిస్తున్నారు.
*చిత్రం... ఆదోని పట్టణంలో గాడిదలపై ఇసుక తరలిస్తున్న దృశ్యం