ఆంధ్రప్రదేశ్‌

‘విశాఖ’ అభివృద్ధికి సహకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 13: అంతర్జాతీయ నగరంగా, స్మార్ట్‌సిటీగా అభివృద్థి చెందుతున్న విశాఖకు పెండింగ్‌లో ఉన్న రూ.100కోట్ల స్మార్ట్‌సిటీ నిధులను త్వరలో విడుదల చేసి, మరింత అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. విశాఖ గ్రేటర్ కార్పొరేషన్ సమావేశ మందిరంలో బుధవారం పారామిలటరీ అధికారులు,జీవీఎంసీతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, తీరప్రాంత అభివృద్ధి, విపత్తుల నివారణ చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో ఎక్కడా ఏం జరిగినా తక్షణ సమాచారం తెలిసేలా ఏర్పాటుచేసిన స్మార్ట్‌పోల్స్ పనితీరు బాగుందని, విశాఖ తరహాలోనే దేశంలోనే అన్ని ప్రధాన నగరాల్లో ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. చండీఘడ్, న్యూఢిల్లీలో సత్వరం స్మార్ట్‌పోల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఏపీలో అత్యధిక తీర ప్రాంతం కలిగిన విశాఖలో
త్వరలోనే సెంట్రల్ మెరైన్ పోలీస్ ఫోర్స్ ఏర్పాటుచేసే అవకాశం ఉందని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదికతో ప్రతిపాదనలు పంపించామన్నారు. విశాఖ నగరాన్ని కాలుష్యం బారినుంచి కాపాడేలా పచ్చదనంతో తీర్చిదిద్దాలని గ్రేటర్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ విశాఖ పరిధిలోని అమృత్,స్మార్ట్‌సిటీ, అందరికీ ఇల్లు అనే పథకాల అమలు, నిధుల విషయాలపై అధికారుల నుంచి సమాచారం తీసుకుని, ఆయా పథకాల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ అందించే ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేస్తే తిరిగి విశాఖకు అదనంగా ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. విశాఖలో ఉన్న పలు విభాగాల భధ్రత సంస్థలు సమన్వయంతో విపత్తుల నివారణకు కృషి చేయాలని, విశాఖను స్మార్ట్,సేవ్ సిటీగా అభివృద్ధి చేయాలన్నారు. ఈ సమావేశంలో విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్,గ్రేటర్ కమిషనర్ సృజన, విశాఖ పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, పారామీలటరి విభాగాధిపతులు పాల్గొన్నారు.
*చిత్రం... విశాఖలో అధికారుల సమీక్షలో మాట్లాడుతున్న కేంద్ర హోంశాఖ సహయ మంత్రి కిషన్ రెడ్డి