ఆంధ్రప్రదేశ్‌

‘టెక్-బీ’తో ఉపాధి నైపుణ్య శిక్షణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 12: ప్రతిష్టాత్మక ‘టెక్ బీ’ కార్యక్రమం ద్వారా యువతకు ఉపాధి నైపుణ్యతలో శిక్షణ ఇచ్చేందుకు హెచ్‌సీఎల్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. సంస్థ ప్రతినిధులు మంగళవారం సచివాలయంలో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో సమావేశమయ్యారు. నైపుణ్య శిక్షణ గురించి సమావేశంలో విస్తృతంగా చర్చించారు. యువతీ, యువకులకు నైపుణ్య శిక్షణ అందించే విధివిధానాలను, కొత్త కోర్సులు, సదుపాయాల వంటి విషయాలను హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రికి వివరించారు. హెచ్‌సీఎల్ క్యాంపస్‌ను సందర్శించాలని మంత్రి గౌతంరెడ్డిని ప్రతినిధులు ఆహ్వానించారు. హెచ్‌సీఎల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే టెక్ బీ కార్యక్రమం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు, శిక్షణ అందించాలనే మంత్రి ప్రతిపాదనకు ప్రతినిధులు అంగీకారం తెలిపారు. వచ్చే ఏడాది జనవరి నుంచి హెచ్‌సీఎల్ ప్రారంభించే శిక్షణ కార్యక్రమాలను సందర్శించాలని సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రవిశంకర్ మంత్రిని కోరారు. యువతకు శిక్షణ అందించేందుకు వసూలు చేసే ఖర్చు తగ్గించాలని మంత్రి మేకపాటి సూచించారు. అందుకు ప్రతినిధులు సుముఖత వ్యక్తం చేశారు. చర్చలో భాగంగా నైపుణ్య రంగంలో శిక్షణా పరమైన అంశాలలో ప్రభుత్వంతో భాగస్వామ్యం పంచుకునేందుకు ఆసక్తి గా ఉన్నట్లు హెచ్‌సీఎల్ ప్రతినిధులు వెల్లడించారు. సమావేశం వివరాలను ముఖ్యమంత్రి జగన్‌కు వివరించి అవసరమైన చర్యలు తీసుకుంటామని మేకపాటి తెలిపారు.