ఆంధ్రప్రదేశ్‌

ఇసుకపై చంద్రబాబు రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 12: ఇసుక మీద రాజకీయంగా బతకాలని ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు భావిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇసుకపై తన పుత్రుడు లోకేష్, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ విఫలం కావడంతో చంద్రబాబే స్వయంగా రంగంలోకి దిగారని విమర్శించారు. కొందరు నీళ్లు తాగి బతుకుతారని, కొందరు గాలి పీల్చి బతుకుతారని, చంద్రబాబు ఇసుకతో రాజకీయంగా బతికేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఉచిత ఇసుక పేరుతో తన హయంలో దోచేశారని విమర్శించారు. ఈ దోపిడీ విధానాలు సరిదిద్దేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. దీనిని జీర్ణించుకోలేక తన పుత్రుడు, దత్తపుత్రుడితో ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఇసుక రీచ్‌ల్లో తవ్వకాలు ముమ్మరం చేశామని వివరించారు. వరదలు, వర్షాల వల్ల ఇసుకను తవ్వలేకపోయామని గుర్తు చేశారు. వర్షాలు, వరదల వల్ల చాలా కాలంగా నిండని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు గేట్లను 8 సార్లు ఎత్తాల్సి వచ్చిందన్నారు. ఈ వర్షాలు వ్యవసాయ రంగానికి ఊపిరిపోసాయన్నారు. ఇదే సమయంలో భవన నిర్మాణ రంగంలో పనులు మందగించాయన్నారు. నిండు వర్షాకాలంలో కూడా చంద్రబాబు ఇంటి పక్కన ఇసుక తీసేవారని, ఇప్పుడు అక్కడ ఇసుక తవ్వే అవకాశం ఉందా అని ప్రశ్నించారు. వరదలు తగ్గడంతో అన్ని రీచ్‌ల్లో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్నారు. రోజువారీ సగటు ఇసుక వినియోగం 80 వేల టన్నులు కాగా, ఇప్పుడు 1.2 లక్షల టన్నుల ఇసుకను తవ్వి తీస్తున్నామన్నారు. స్టాక్ పాయింట్ల సంఖ్యను 137 నుంచి 180కి పెంచామని వెల్లడించారు. ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకూ ఇసుక వారోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మరో వారం రోజుల్లో ఇసుక తవ్వకాలను రెండు లక్షల టన్నులకు తీసుకువస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 275 ఇసుక రీచ్‌ల్లో సోమవారం నాటికి 99 రీచ్‌ల్లో తవ్వకాలు ప్రారంభమయ్యాయన్నారు. శ్రీకాకుళం, విశాఖ, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో శాండ్ డిపోలను ప్రారంభిస్తున్నామన్నారు. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. 200 చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. చంద్రబాబు ఇసుక దందాపై జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మరిచిపోయారా అని ప్రశ్నించారు. ఉచిత ఇసుక పేరుతో లారీ ఇసుకకు 15 వేల రూపాయలకు అమ్ముకుంటున్నారని ఆరోపించడాన్ని గుర్తు చేశారు. ఇసుక కోసం వచ్చిన పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరిస్తామన్నారు.