ఆంధ్రప్రదేశ్‌

మనం ప్రజా సేవలకులం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 12: మనం ఏదైనా అర్జీతో ఓ అధికారి వద్దకు వెళ్లినప్పుడు వారు ఎలా స్పందించాలనుకుంటామో.. అదే తీరులో మన దగ్గరకు వచ్చిన వారిని గౌరవించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు. సచివాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కే నారాయణస్వామి, ఉన్నతాధికారులతో కలసి స్పందన కార్యక్రమంపై మంగళవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. వినతుల పరిష్కారంలో నాణ్యత
ముఖ్యం.. స్పందనలో వచ్చే ఫిర్యాదుల నాణ్యత కోసం స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ నిర్వహిస్తున్నాం.. ఆరు జిల్లాల్లో శిక్షణ పూర్తయింది మిగిలిన చోట్ల త్వరలో ప్రారంభిస్తామన్నారు. కలెక్టర్లు, తహశీల్దార్లు, ఎస్సైలు, మునిసిపల్ కమిషనర్లు ఇతర అధికారులు ఈ శిక్షణా కార్యక్రమానికి విధిగా హాజరు కావాలన్నారు. వినతిపత్రంతో వచ్చిన వ్యక్తిపట్ల ఎలా వ్యవహరించామనేది ముఖ్యమన్నారు. అధికారం చలాయించటానికి కాదు.. సేవ చేసేందుకనే విషయాన్ని విస్మరించరాదని హితవు పలికారు.
అవినీతిపై పోరు ఉద్ధృతం
అవినీతి అనే అంశంపై పోరాటాన్ని సవాల్‌గా తీసుకోవాలన్నారు. ఏ స్థాయిలోనూ అవినీతికి తావివ్వరాదన్నారు. వచ్చే రెండు, మూడు వారాల్లో ఏసీబీని పెద్దఎత్తున రంగంలోకి దించుతున్నామని స్పష్టం చేశారు. ఇకపై అవినీతి నిరోధక శాఖ చాలా చురుగ్గా పనిచేస్తుందని తెలిపారు.
*చిత్రం...ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి