ఆంధ్రప్రదేశ్‌

అవుట్ సోర్సింగ్‌లోనూ రిజర్వేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ (ఆప్‌కాస్) వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. మంగళవారం స్పందనపై సమీక్ష సందర్భంగా సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో కలసి వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రతి అవుట్ సోర్సింగ్ ఉద్యోగానికి కోడ్ నెంబర్ ఉంటుంది. ప్రతి కాంట్రాక్ట్‌ను ఒక ఎంటీటీగా తీసుకుని అందులో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అవకాశం ఇస్తారు. మొత్తం మీద మహిళలకు 50 శాతం రిజర్వేషన్
పాటించాలి.. జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు జీతాలు ఇచ్చిన తరువాతే అధికారులు తీసుకునే స్థాయికి రావాలని ఆకాంక్షించారు. డిసెంబర్ 15 కల్లా ఉద్యోగాల జాబితాలు కమిటీ నుంచి శాఖాధిపతులకు రావాలని వచ్చే జనవరి 1 నుంచి నియామక పత్రాలు అందించాలని వివరించారు. జిల్లాల్లోని అన్ని అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, రాష్టస్థ్రాయి, సెక్రటేరియట్ ఉద్యోగాలు కూడా ఈ కార్పొరేషన్ పరిధిలోకి తెస్తామన్నారు. మధ్యవర్తులు, దళారుల వ్యవస్థను అంతమొందించేందుకే ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జీతాలు చెల్లించేటప్పుడు ఉద్యోగులు మోసపోకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. జీతాల్లో కోత పెట్టే అడ్డగోలు కాంట్రాక్ట్ వ్యవస్థకు చెక్ పెడతామన్నారు. సకాలంలో జీతాలు చెల్లించటంతో పాటు ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్‌ఐ వంటి వాటిని ఎగ్గొట్టకుండా ఉండేందుకు లంచాలకు తావులేని విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నారు. నెలసరి జీతం రూ. 30వేల లోపు ఉన్న ఉద్యోగాలను అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ కింద భర్తీ చేస్తామన్నారు. వివిధ శాఖలు, విభాగాలు తమకు కావాల్సిన ఉద్యోగాల జాబితాను కార్పొరేషన్‌కు సమర్పిస్తాయి. రాష్ట్ర స్థాయిలో సచివాలయం నుంచి జిల్లా స్థాయి వరకు ఈ ఉద్యోగాల భర్తీ కార్పొరేషన్ ద్వారానే జరుగుతుంది. జిల్లా స్థాయిలో ఇన్‌చార్జి మంత్రి అప్రూవల్ అథారిటీగా వ్యవహరిస్తారు. జిల్లా కమిటీకి కలెక్టర్ నేతృత్వం వహిస్తారు. సచివాలయంలో సంబంధిత శాఖ కార్యదర్శి కమిటీకి కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వహించాలి.. డిసెంబర్ 15 లోగా ఈ ప్రక్రియ పూర్తిచేసి జనవరి 1 నుంచి ప్లేస్‌మెంట్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.