ఆంధ్రప్రదేశ్‌

రైతే దేశానికి వెనె్నముక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 11: రైతుల కష్టాలను అధిగమింపచేసే క్రమంలో అవసరమైన పూర్తి సహాయ, సహకారాలను అందించవల్సిన బాధ్యత నేటి సమాజంపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. వ్యవసాయదారులను ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్‌ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ సమ్మాన్ యోజన వంటి రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని గవర్నర్ పేర్కొన్నారు. దేశానికి వెనె్నముక రైతులేనని వారి అభ్యున్నతి విషయంలో మరిన్ని పథకాలను అమలు చేయవలసి ఉందని వివరించారు. విజయవాడలోని ఒక కనె్వన్షన్ సెంటర్‌లో సోమవారం రాజ్యసభ మాజీ సభ్యుడు డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన క్రాప్ హాలిడే (పంట సెలవుదినం) పుస్తకాన్ని గవర్నర్ ఆవిష్కరించారు. పుస్తకావిష్కరణ నేపథ్యంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ వివిధ వ్యవసాయ ఉత్పత్తుల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ను నిర్ణయించే సమయంలో ఆ ధరలు రైతులకు లాభదాయకంగా ఉంటాయా .. లేదా అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని గవర్నర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్‌లోని పొగాకు రైతులు 2000 సంవత్సరంలో పంట సెలవు దినం వంటి చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవటానికి దారితీసిన పరిస్థితులను ‘క్రాప్ హాలిడే’ పుస్తకం ద్వారా వెలుగులోకి తీసుకురావటం ముదావహమన్న గవర్నర్ హరిచందన్ పుస్తక రచయిత డాక్టర్ యలమంచిలి శివాజీని ప్రత్యేకంగా అభినందించారు. రైతుల పంట సెలవు నిర్ణయం వల్ల వ్యవసాయ సంక్షోభం నుండి బయట పడటమే కాకుండా, ఆనాటి రైతుల బాధల గురించి పాలకులు తెలుసుకోగలిగారని గవర్నర్ వివరించారు. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఐక్యంగా ముందుకు సాగాలని, అప్పుడే ఆశించిన ఫలితం సిద్ధిస్తుందని గవర్నర్ అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించి, పుస్తక పరిచయం చేసిన ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర హిందీ అకాడమీ అధ్యక్షుడు, ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ రైతుల సమస్యలపై నాడు పార్లమెంటులో నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత యలమంచిలికి దక్కుతుందన్నారు. ఆచార్య ఎన్‌జి రంగా, చరణ్‌సింగ్‌ల తదుపరి రైతుల కోసం పోరాటాలు చేసిన వారిలో శివాజీది ప్రథమ స్థానమన్నారు. పుస్తక రచయిత డాక్టర్ యలమంచిలి శివాజీ మాట్లాడుతూ రైతు సమస్యలపై విభిన్న సందర్బాల్లో రాసిన వ్యాసాల సంపుటిని క్రాప్ హాలీడే పేరిట తీసుకువచ్చామని, గవర్నర్ చేతుల మీదుగా దీనిని ఆవిష్కరింప చేసుకోవటం శుభపరిణామమని తెలిపారు. రైతు నేస్తం ఫౌండేషన్ చైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ యడ్లపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతుల సమస్యలను గుర్తించటంతో పాటు వాటికి సానుకూల పరిష్కారాలు చూపిన ఘనత కూడా శివాజీకి దక్కుతుందన్నారు. రైతు ప్రయోజనాలే పరమావధిగా తమ ట్రస్టు నుండి రైతు నేస్తం, ప్రకృతి నేస్తం, పశు నేస్తం పేరిట పుస్తకాలను ప్రచురిస్తున్నామన్నారు. పొగాకు బోర్డు అధ్యక్షులు యడ్లపాటి రఘునాథ్‌బాబు, పొగాకు బోర్డు మాజీ చైర్మన్ డాక్టర్ పి దయాచారి, కార్యదర్శి అద్దంకి శ్రీ్ధర్ ప్రసంగించారు. పుస్తకావిష్కరణలో భాగంగా పలువురు పొగాకు రైతులను గవర్నర్ సత్కరించి, మెమెంటోలను అందజేశారు. ఆలూరి చంద్రశేఖర్, డాక్టర్ కె హేమాలకు తొలి కృతి స్వీకర్త హోదా దక్కగా గవర్నర్ వారికి పుస్తకాలను బహుకరించారు.