ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వంలో చలనం కోసమే ఇసుకదీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 11: మొద్దునిద్ర పోతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో చలనం తెచ్చేందుకే ఇసుక దీక్షను చేపట్టినట్లు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈనెల 14వ తేదీన విజయవాడలో జరపతలపెట్టిన 12 గంటల ఇసుక దీక్షపై పార్టీ ముఖ్య నేతలతో సోమవారం గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చించారు. అన్ని జిల్లాల నుండి పెద్ద ఎత్తున కార్మికులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రానున్నందున వేదిక వద్ద ఏర్పాట్లు, పార్కింగ్ వసతి, తాగునీటి ఏర్పాట్లు, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు ఇప్పటివరకు దేశంలో మరే రాష్ట్రంలో లేవన్నారు. వైసీపీ ప్రభుత్వం గత ఐదు నెలలుగా చేపట్టిన చర్యల వల్లే ఈ దుస్థితి దాపురించిందన్నారు. ఈ దుస్థితిని చక్కదిద్దాలంటే కార్మికుల కుటుంబాల్లో భరోసా కల్పించాలన్నారు. సెల్ఫీలతో ఆత్మహత్యలు చేసుకోవడం గతంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరగలేదన్నారు. కేవలం 20 రోజుల్లో 40 మంది కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు, కార్పెంటర్‌లు, ప్లంబర్‌లు ఆత్మహత్యలు చేసుకోవడం వైసీపీ నేతల ఇసుక మాఫియా దురాఘతాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఓ వైపు ఇసుక కొరతను సృష్టించిన వైసీపీ నేతలు మరో కొత్త సమస్యను తెచ్చారని, రాజధాని అమరావతి, పోలవరం అన్ని ప్రాజెక్టు నిర్మాణాలను ఆపివేశారన్నారు. దీంతో 32 రంగాలకు చెందిన కార్మికులు జీవనోపాధి కోల్పోయారని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రకృతి ప్రసాదించిన ఇసుకపై వైసీపీ నేతల పెత్తనమేంటని, సొంతపొలంలో మట్టిని తీసుకెళ్లాలన్నా, ఊరిలోని వాగులో ఇసుక తీసుకెళ్లాలన్నా వైసీపీ నేతల అనుమతులు ఎందుకంటూ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రవాణా రంగాన్ని నిర్వీర్యం చేయడంతో వేలాది లారీలు, ట్రక్కులు నిలిచిపోయి వాహన రంగ కార్మికులు కూడా వీధిన పడ్డారన్నారు. రోడ్డు మెటల్ నుండి అన్ని రకాల మైనింగ్‌లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి 50 శాతం మేరకు వాటాలు ఇవ్వాలని వేధిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇసుక బ్లాక్ మార్కెట్‌ను అరికట్టడంతో పాటు ఇసుక కొరత వలన ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రభుత్వం నెలకు 10 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం అందించి, ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
సామాన్యుడి సొంతింటి కలకు తూట్లు
దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని ఇసుక కొరతను మన రాష్ట్రంలోనే సృష్టించి వైసీపీ నేతలు బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. సోమవారం ఈ మేరకు గుంటూరులోని రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రకృతి ప్రసాదించిన ఇసుకను ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని, అందుకే తమ హయాంలో ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశ పెట్టామన్నారు. దీంతో కొరత లేకుండా సామాన్యులందరికీ ఇసుక అందుబాటులో ఉందన్నారు. వైసీపీ పాలనలో ఇసుక కృత్రిమ కొరత సృష్టించి 30 లక్షల మంది కార్మికులు ఆకలితో అలమటించేలా 40 మంది బలవన్మరణాలకు పాల్పడేలా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇసుక కృత్రిమ కొరతతో భవన నిర్మాణ రంగం కుదేలైందని, ఈ రంగంపై ఆధారపడిన వారు పనులు లేక ఆకలితో అలమటిస్తున్నారన్నారు.
కూలీల ఆకలి కేకలు పట్టవా?
గత ఆరు నెలలుగా రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా దానిపై ఆధారపడి బతుకుతున్న కార్మికులు జీవనోపాధిలేక ఆకలి కేకలతో అలమటిస్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆకలి బాధలు తీర్చుకునేందుకు కార్మికులు ఆలయాల్లో ప్రసాదాలపై ఆధారపడుతుంటే బాధగా ఉందంటూ సోమవారం ట్విట్టర్‌లో చంద్రబాబు పేర్కొన్నారు.
*చిత్రం... పార్టీ ముఖ్యనేతల భేటీలో మాట్లాడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు