రాష్ట్రీయం

గోదావరి తీరాన కార్తీక సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: గోదావరి నదీ తీరాన ఎల్లెడలా సోమవారం కార్తీక మాస సందడి కనిపించింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రఖ్యాత శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుండి కార్తీక దీపారాధనతో గోదావరి తీరం మిరమిట్లుగొలిపింది. సోమవారం తెల్లవారు జాము నుంచి గోదావరి నది మెరిసిపోయింది. కార్తీక మాసం ప్రాశస్థ్యం నేపథ్యంలో పవిత్ర శైవ క్షేత్రాలను దర్శించుకోవడానికి భక్తులు గోదావరి తీరానికి తరలివచ్చారు. బస్సులు, రైళ్ళు, ప్రత్యేక టూరిస్టు బస్సులతో యాత్రికులు ఇక్కడకు వచ్చి కార్తీక స్నానాలు ఆచరించి పవిత్ర ప్రాచీన పురాణ ప్రాశస్థ్యం కలిగిన పుణ్యక్షేత్రాలను దర్శించుకుని తరించారు.
రాజమహేంద్రవరంలోని కోటిలింగాల స్నానఘట్టం, గౌతమీ, పుష్కర ఘాట్లు పవిత్ర గోదావరి స్నానాలతో భక్తులతో కిటకిటలాడాయి. గోదావరి నది ఒడ్డున వున్న కోటిలింగేశ్వరస్వామి, మార్కండేయేశ్వర, విశే్వశ్వరస్వామి ఆలయాల్లో రుద్రాభిషేకాలు చేయించుకుని భక్తులు తరించారు. హరహర మహాదేవ శంభోశంకర అంటూ తీరమంతా మారుమోగింది. ఒక పక్క అయ్యప్పస్వామి దీక్షాధారులతోనూ, మరోవైపు సాధారణ భక్తులతోనూ స్నానఘట్టాలు, పుణ్యక్షేత్రాలు రద్దీగా మారాయి. తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం, పిఠాపురం పాదగయ కుక్కుటేశ్వరస్వామి క్షేత్రం, అష్టాదశ శక్తి పీఠం పురూహితిక అమ్మవారి ఆలయంలో భక్తులు బారులు తీరి దర్శనం చేసుకున్నారు. కోటిపల్లి క్షేత్రం, క్షణ ముక్తేశ్వరస్వామి, మురమళ్ళ శ్రీ వీరేశ్వరస్వామి, కుండళేశ్వరం, అయినవిల్లి, వాడపల్లి, అప్పనపల్లి, అంతర్వేది క్షేత్రాలు గత సోమవారం కంటే అధికంగా భక్తులతో కిటకిటలాడాయి. పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామ శ్రీ భీమేశ్వరస్వామి, సామర్లకోటలోని శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వరస్వామి క్షేత్రాల్లో వేకువ జాము నుంచే భక్తులు బారులు తీరి అభిషేకాలు, ప్రత్యేక పూజలతో తరించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, పాలకొల్లులోని సోమేశ్వరస్వామి, క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

*చిత్రం...కిటకిటలాడుతున్న రాజమహేంద్రవరం పుష్కరఘాట్