ఆంధ్రప్రదేశ్‌

ఇసుకపై బాబు దీక్ష రాజకీయమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, నవంబర్ 11: రాష్ట్రంలో గత తెలుగుదేశం ప్రభుత్వం అక్రమాలు చేసినందుకే ప్రజలు తిరస్కరించారని, ఇప్పుడు ఇసుక పేరుతో చంద్రబాబు దీక్ష చేపట్టి రాజకీయం చేస్తున్నారని మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సోమవారం అనంతపురం నగరంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకుందో అందరికీ తెలుసన్నారు. ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు సహచరులు, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు సహజ సంపదను ఇష్టానుసారం దోచుకున్నారని ఆరోపించారు. తమ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో నూతన ఇసుక విధానాన్ని తెచ్చి అందరికీ తక్కువ ధరకే అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుందని అన్నారు. దీనిపై రాద్ధాంతం, రాజకీయం చేయడం ఏమిటని ప్రశ్నించారు.
ఇక రాజధాని అమరావతిని అందరికీ అనుకూలమైన, నిర్మాణాలకు ఇబ్బంది లేని చోట ఏర్పాటు చేస్తామన్నారు. రాష్టమ్రంటే ఒక సామాజిక వర్గానికో, ఒక వ్యక్తికో చెందిన ప్రాంతం కాదని, 13 జిల్లాల ప్రజల ఉమ్మడి సొత్తు అని బొత్స అన్నారు. రాజధాని ఏర్పాటుపై ముఖ్యమంత్రి నిపుణుల కమిటీ వేశారని, వారి సూచన మేరకు ఎక్కడ రాజధాని ఏర్పాటు చేయమంటే అక్కడ నిర్మిస్తామని అన్నారు. ఇప్పుడున్న చోట 100 అడుగులు (33 మీటర్లు) లోతు పిల్లర్లు వేస్తే గానీ భవనాలు నిలిచే అవకాశం లేదని, చంద్రబాబు నివాసం కూడా 100 అడుగుల లోతులో కట్టిందేనని అన్నారు. మాకు ఎవరి మీద అక్కసు గానీ, ద్వేషం గానీ లేదని, రాష్ట్ర ప్రజలకు భద్రమైన రాజధాని కావాలన్నదే లక్ష్యమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమరావతి పేరుతో రాజధాని నిర్మాణానికి భద్రతలేని ప్రాంతంలో 33 వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ చేశారని, 900 గజాల లెక్కన భవనాల నిర్మాణానికి రూ.17 వేల కోట్లతోనూ, మరో రూ.15 వేల కోట్లతో రోడ్ల నిర్మాణాలకు టెండర్లు పిలిచారని, ఆ లెక్కన ఎకరా రూ.కోటికి కొనడం ఏమిటని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం భూములిచ్చిన రైతులు నష్టపోకుండా చూస్తున్నామన్నారు.
రాష్ట్రంలో తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని, త్వరలో టెండర్లు పిలిచి ఇంటింటికీ నీటి సౌకర్యం కల్పిస్తామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రతి పేదవాడికీ ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో ఇళ్లస్థలాలు, ఇల్లు నిర్మించి ఇస్తామన్నారు. ఎక్కువగా వ్యక్తిగత ఇళ్ల నిర్మాణాలకే ప్రాధాన్యమిస్తున్నామని, అవసరాన్ని బట్టి భూ సేకరణ చేయడం, భూమి లేని చోట కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు అవసరమైన ల్యాడ్ పూలింగ్‌కు రెండు రోజుల్లో జీవో ఇస్తున్నామని మంత్రి బొత్స అన్నారు. టీట్కో ద్వారా మంజూరైన ఇళ్ల విషయంలో అనేక రకాలైన ఆరోపణలు వచ్చాయని, వాటిపై విచారణ జరుపుతున్నామని, అనంతరం అర్హులను గుర్తించి వారికి ఇళ్లు కేటాయిస్తామని ఆయన చెప్పారు. రాజకీయాలు, కుల,మాతాలు, వర్గాలకు అతీతంగా పేదలైన ప్రతి ఒక్కరికీ ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు. ఎక్కడా లబ్ధిదారులను తగ్గించాలని అధికారులు ఆలోచించరాదని, అర్హులైన వారందరికీ ఆధార్, తెల్లరేషన్ కార్డులు ఇచ్చి ఇళ్ల పట్టాలు, ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించామన్నారు. తమను నమ్మి 151 అసెంబ్లీ స్థానాలిచ్చిన రాష్ట్ర ప్రజలకు పారదర్శక పాలన అందిస్తామని మంత్రి అన్నారు.
*చిత్రం...అనంతపురంలో విలేఖరులతో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ