ఆంధ్రప్రదేశ్‌

న్యాయస్థానాలను ఆశ్రయించి అగ్రి ఆస్తులు కాపాడాం: లోకేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 8: మీ విద్యార్హతలు, రాజకీయ అనుభవం రాష్ట్ర శాసనసభాపతి పదవికే వనె్న తెస్తాయని ఆశించానని, అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న పదజాలం మహోన్నతమైన స్పీకర్ పదవినే చిన్నబుచ్చేలా ఉన్నాయని స్పీకర్ తమ్మినేని సీతారాంపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. శాసనసభాపతి స్థానం అలంకరించడం ఓ అరుదైన అవకాశమన్న లోకేష్ విలువలతో సభను హుందాగా నడిపిస్తానని చెప్పిన మాటలు ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. శుక్రవారం ఈ మేరకు స్పీకర్ తమ్మినేని సీతారాంకు గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుండి లోకేష్ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆరుసార్లు శాసనసభలో సభ్యుడిగా వ్యవహరించి అదే సభకు అధ్యక్షుడుగా ఉన్నారనే విషయాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలని సూచించారు. సభాపతిగా ప్రతిపక్ష నేతపై మీరు చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవేనా అనే అనుమానం కలుగుతోందన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే అగ్రిగోల్డ్ మోసాలు వెలుగుచూశాయని, టీడీపీ ప్రభుత్వ హయాంలో వివరాలు సేకరించి, న్యాయస్థానాలను ఆశ్రయించి అగ్రిగోల్డ్ ఆస్తులను కాపాడామన్నారు.
మహిళ పక్షాన టీడీపీ పోరాటం
విజయవాడ(సిటీ): వైసీపీ పార్టీ కార్యకర్తలకు ఉద్యోగాలు కల్పించేందుకు లక్షల మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నారని మాజీ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. వేల మంది జీవితాల్లో వెలుగు లేకుండా చేయడం దుర్మార్గమైన చర్య అని శుక్రవారం ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 4లక్షల మంది వైకాపా కార్యకర్తలకు ఉద్యోగాలివ్వడం కోసం, 10 లక్షల మంది ఉద్యోగులుపై ఇప్పటి వరకు వేటు వేశారన్నారు. వెలుగు యానిమేటర్లకి టీడీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.