ఆంధ్రప్రదేశ్‌

మాతృభాష ఉనికికే ప్రమాదం: ఎమ్మెల్సీ డొక్కా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 8: రాష్ట్రప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వలన చివరకు తెలుగుభాష ఉనికికే ప్రమాదం వాటిల్లే పరిస్థితులు తలెత్తాయని, ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లభాష బోధనకు అనుమతులు ఇవ్వడమే అందుకు నిదర్శనమని టీడీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1 నుండి 8వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టడంతో తెలుగుభాష ఉనికే ప్రశ్నార్థకం కానుందన్నారు. తల్లిదండ్రుల అభీష్టం మేరకే నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. గత ప్రభుత్వం మున్సిపల్ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ విధానాన్ని తీసుకురావాలని చూసినప్పుడు ప్రతిపక్షంలో ఉండి వ్యతిరేకించిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక అడ్డగోలుగా రాష్టమ్రంతా ఆంగ్లభాషాబోధనను ఎలా అనుమతిస్తుందని ప్రశ్నించారు.