ఆంధ్రప్రదేశ్‌

ఆంగ్లం వద్దు.. మాతృభాషే ముద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 8: ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. విశాఖ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాతృ భాషను గౌరవిస్తూంటే వైసీపీ ప్రభుత్వం ఆంగ్ల భాషను తప్పనిసరి చేయడం అనాలోచిత నిర్ణయంగా పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం కూడా ఆంగ్ల మాద్యమాన్ని ప్రవేశపెట్టాలన్న ఆలోచన చేసినప్పుడు మిగిలిన పక్షాలతో పాటు బీజేపీ కూడా తీవ్రంగా వ్యతిరేకించిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా మాతృభాషకు అన్యాయం జరిగేలా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు ఉపసంహరించుకునేలా ఉద్యమించడంలో బీజేపీ ముందుంటుందని స్పష్టం చేశారు. మాతృభాషను విస్మరిస్తే మనుగడ కష్టమని, ప్రతి ఒక్కరూ మాతృభాషను గౌరవిస్తూ ఇతర భాషలను అభ్యసించడం తప్పుకాదన్నారు. అయితే పూర్తిగా మాతృభాషను పక్కనపెట్టి ఆంగ్ల మాద్యమాన్ని తప్పనసరి చేయడం సరికాదన్నారు. ఇప్పటికే కొన్ని పాఠశాలల్లో నిర్బంధ ఆంగ్ల మాద్యమ విద్యా బోధన కొనసాగుతోందని, ఇది ఎంతమాత్రం సహేతుకం కాదన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలనేది మేథావుల అభిప్రాయంగా పేర్కొన్నారు. పక్క రాష్ట్రాలు మాతృభాష కోసం చట్టాలు తెస్తోంటే ఇక్కడ మాత్రం ఉన్నవాటిని ఉట్టికెక్కించే చర్యలు ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకూ ఉద్యమిస్తామని స్పష్టం చేశారు.