ఆంధ్రప్రదేశ్‌

ఉగాదికి 25 లక్షల ఇళ్ల పట్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 8: రాష్ట్రంలో ప్రతి పేదవారికి సొంతింటి కల నెరవేరాలనే లక్ష్యంతో వచ్చే ఉగాది పండుగకు 25 లక్షల మంది లబ్దిదారులకు రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌తో కూడిన ఇళ్ల పట్టాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఇన్‌చార్జి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, సీసీఎల్‌ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం ఈ అంశంపై సచివాలయం నుంచి జిల్లాల సంయుక్త కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇళ్ల పట్టాల పంపిణీకి వీలుగా గ్రామాల వారీగా ప్రభుత్వ భూములను గుర్తించటంతో పాటు లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. గుర్తించిన లబ్ధిదారులకు రిజిస్టర్డ్ ఇళ్ల పట్టాల డాక్యుమెంట్లు అందించటంతో పాటు వారి ప్లాట్లు ఎక్కడ ఉన్నదీ స్వయంగా తెలుసుకునేందుకు వీలుగా సమాచారం సిద్ధం చేసుకోవాలన్నారు. ఇప్పటి వరకు 22 లక్షల మంది లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జేసీలు, ఆర్డీవోలను ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసేందుకు అనువుగా ఉన్నాయో వాటిని మొదట గుర్తించాలని సూచించారు. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు వీలుగా ఉండి లిటిగేషన్‌లో ఉన్న ప్రభుత్వ భూముల్ని గుర్తించి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని వివరించారు. అర్హులైన ఏ ఒక్క లబ్దిదారులకు ఇళ్ల స్థలం రాలేదనే అపవాదు ప్రభుత్వానికి ఉండరాదన్నారు. అదే సమయంలో అనర్హులు లబ్ధి పొందకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇళ్ల స్థలాలకై గుర్తించిన భూములన్నీ గ్రామాల వారీగా మ్యాపింగ్ చేసే ప్రక్రియను చేపట్టాలని ఆదేశించారు. అభ్యంతరంలేని ఆక్రమిత స్థలాలను రెగ్యులరైజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తుచేశారు. ఇళ్ల స్థలాలకై వివిధ ప్రభుత్వ ఏజెన్సీల వద్దగల ప్రభుత్వ భూములను కూడా గుర్తించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో టిడ్కో ద్వారా నిర్మిస్తున్న ఇళ్ల లబ్ధిదారుల వివరాలను తెలుసుకోవటంతో పాటు వివిధ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీల వద్ద ఇళ్ల స్థలాల నిమిత్తం నిర్దేశించిన భూముల వివరాలను కూడా సేకరించాలని స్పష్టం చేశారు. ఇళ్ల స్థలాలకై ప్రభుత్వ భూములు అందుబాటులో లేకుంటే ప్రైవేట్ భూములను సేకరించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైతే రెండు పంటలు పండే డెల్టా ప్రాంతంలోని భూముల సేకరణ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఈ ప్రక్రియలో కలెక్టర్లు కూడా భాగస్వాములు కావాలన్నారు. రెవెన్యూశాఖ కార్యదర్శి ఉషారాణి మాట్లాడుతూ ఇళ్ల స్థలాలకై ప్రభుత్వ భూముల గుర్తింపులో భాగంగా గతంలో సాంఘిక సంక్షేమశాఖ ద్వారా ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూములు, భూదాన భూముల స్థితిగతులను తెలుసుకోవాలని సూచించారు. రెవెన్యూశాఖ ప్రత్యేక కమిషనర్ హరి నారాయణ మాట్లాడుతూ ఇళ్ల స్థలాలకై ఇప్పటి వరకు 23వేల 180 ఎకరాల భూములు గుర్తించామని ఇంకా అవసరమైన భూములను త్వరగా గుర్తించాలని జేసీలను ఆదేశించారు. గ్రామ సచివాలయాల్లో 10వేల మంది సర్వేయర్లు అందుబాటులో ఉన్నారని గుర్తించిన భూముల పెగ్ మార్కింగ్, ప్లాట్లుగా కేటాయించేందుకు వారి సేవలను వినియోగించు కోవాలని సూచించారు. సీసీఎల్‌ఏ కార్యదర్శి చక్రవర్తి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.