ఆంధ్రప్రదేశ్‌

ఆరోగ్యమే అసలైన లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి : రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా మార్చేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశించారు. ప్రధాన సమస్యగా మారిన రక్తహీనత, పౌష్టికాహార లోపాన్ని నియంత్రించటంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. పౌష్టికాహార లోపం, రక్తహీనత అధికంగా ఉన్న గిరిజన, సబ్‌ప్లాన్ ప్రాంతాల్లో పైలెట్ ప్రాజెక్ట్ కింద వైఎస్సార్ అమృత హస్తం, వైఎస్సార్ బాల సంజీవని కింద మరింత పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని నిర్ణయించింది. కేవలం గిరిజన ప్రాంతాల్లోనే కాకుండా గిరిజనులు అధికంగా నివసించే
సబ్‌ప్లాన్ ప్రాంతాల్లో కూడా పైలెట్ ప్రాజెక్ట్ కింద ఈ ఏడాది డిసెంబర్ నుంచి గర్భవతులు, బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న గుడ్లు, పాల పరిమాణాన్ని పెంచటంతోపాటు సబ్‌ప్లాన్ ప్రాంతాల్లో కూడా సంతృప్తికరంగా అమల్లోకి తేవాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల్లో రక్తహీనత, పౌష్టికాహార లోపంతో తీవ్రంగా బాధపడుతున్నారని, తీవ్ర ఆరోగ్య సమస్యలకు ఇవి దారి తీస్తున్నాయని అనేక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో గత కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విషయమై సచివాలయంలో బుధవారం మహిళా, శిశు సంక్షేమం, విద్యాశాఖ మంత్రులు తానేటి వనిత, ఆదిమూలపు సురేష్‌లతో కలసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కార్యక్రమాలు, వాటిలో మార్పులు తీసుకువచ్చే విషయమై సమావేశంలో చర్చించారు. రక్తహీనత, పౌష్టికాహార లోపం అధికంగా ఉన్న గిరిజన, సబ్‌ప్లాన్ ప్రాంతాల్లో మరింత పోషక విలువలున్న ఆహారం అందించాలని ఆదేశించారు. పైలెట్ ప్రాజెక్ట్ అమల్లోకి వచ్చిన అనంతరం మిగిలిన ప్రాంతాలకు విస్తరింప చేయాలని నిర్దేశించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం గర్భవతులకు నెలకు రూ. 1062 విలువైన ఆహారం పంపిణీ చేయనున్నారు. 25 రోజుల పాటు భోజనం, గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, రూ. 500 విలువచేసే వైఎస్సార్ బాల సంజీవని కిట్‌లు (మొదటి వారం రెండు కిలోల మల్టీగ్రెయిన్ ఆటా, రెండో వారం అరకిలో వేరుసెనగలతో చేసిన చిక్కీ, మూడోవారం అరకిలో రాగి ఫ్లేవర్, అరకిలో బెల్లం, నాలుగోవారం అరకిలో నువ్వుండలు) అందించాలని సూచించారు. ఈ పథకాన్ని 77 గిరిజన, సబ్‌ప్లాన్ మండలాల్లోని 6 నెలల నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులకు వర్తింప చేయనున్నారు. ఇందులో భాగంగా నెలలో ప్రతిరోజు గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, వైఎస్సార్ బాలామృతం కిట్‌లు పంపిణీ చేస్తారు. మొత్తంగా నెలకు రూ. 600 విలువచేసే పౌష్టికాహారాన్ని ప్రభుత్వం అందిస్తుంది. 77 గిరిజన సబ్‌ప్లాన్ మండలాల్లోని 3-6 సంవత్సరాలలోపు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా నెలకు 25 రోజుల పాటు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తారు. నెలకు రూ. 560 విలువైన పౌష్టికాహారం ప్రతి చిన్నారికి అందిస్తారు. నెలలో 25 రోజుల పాటు భోజనం, గుడ్డు, పాలు, పోషకాలు ఇచ్చే మరో అల్పాహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్ట్ అమలు కోసం శ్రీకాకుళం జిల్లాలో ఒకటి, విజయనగరంలో 7, విశాఖపట్నంలో 11, తూర్పుగోదావరిలో 11, పశ్చిమ గోదావరిలో 6 గిరిజన మండలాలతో కలిపి మొత్తం 36 మండలాలను ఎంపిక చేయగా, సబ్‌ప్లాన్ ఏరియాకు సంబంధించి శ్రీకాకులంలో 19, విశాఖపట్నంలో 6, తూర్పుగోదావరిలో 4, పశ్చిమలో 3, ప్రకాశంలో 3, కర్నూలులో 3, గుంటూరులో 3 వెరసి 41 మండలాలను ఎంపిక చేశారు.
మధ్యాహ్న భోజనంపై సీఎం సమీక్ష
మధ్యాహ్న భోజనంలో నాణ్యత, పోషక విలువలు పెంచటంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పిల్లలు ఏ రకమైన ఆహారం భుజిస్తున్నారనేది గుర్తించాలన్నారు. ఆ తరువాత ఎలాంటి మార్పులు తీసుకురావాలనే విషయమై ఓ నిర్ధారణకు రావాలని సూచించారు. పిల్లలకు మంచి ఆహారంతో భోజనం అందించాలని దీనిపై సమగ్ర ఆధ్యయనం చేయాలన్నారు. పిల్లలకిచ్చే ఆహారంలో పోషక విలువలు జోడించే పదార్థాలను పంపిణీ చేయాలని ఇందుకు అవసరమైతే నిపుణుల సలహాలు తీసుకోవాలన్నారు.