ఆంధ్రప్రదేశ్‌

తుంగభద్ర 33 గేట్లు ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్లారి, అక్టోబర్ 23: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర జలాశయానికి మళ్లీ వరద రావడంతో మొత్తం 33 గేట్లు ఎత్తి దిగువ నదిలోకి పెద్దమొత్తంలో నీరు విడుదల చేస్తున్నారు. జలాశయానికి బుధవారం 1,44,749 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో జలాశయం 33 గేట్లలో 25 గేట్లను మూడున్నర అడుగులు, మిగతా 8 గేట్లను ఒక అడుగు చొప్పున ఎత్తి 1,69,120 క్యూసెక్‌ల నీటిని దిగువ నదిలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.దీంతో గేట్లను మరింత ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తారు. నదిలోకి పెద్దమొత్తంలో నీరు విడుదల చేయడంతో పరివాహక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. బుధవారం జలాశయం నీటిమట్టం 1632.40 అడుగులుగా నమోదుకాగా 98.55 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
*చిత్రం... తుంగభద్ర జలాశయం గేట్లు ఎత్తిన దృశ్యం