ఆంధ్రప్రదేశ్‌

అభ్యుదయవాది.. పేదల పెన్నిధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: విలువలతో కూడిన జీవితాన్ని గడిపిన దివంగత ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్ అభ్యుదయవాదిగా, పేదల పెన్నిదిగా అందరికీ ఆదర్శప్రాయుడేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్నారు. స్థానిక లెనిన్ సెంటర్‌లోని అంబేద్కర్ భవన్‌లో ఏర్పాటు చేసిన దివంగత ఎస్‌ఆర్ శంకరన్ విగ్రహాన్ని మంగళవారం సీఎస్ ఆవిష్కరించి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ఐఏఎస్ అధికారులు 1957-92 మధ్య ఐఏఎస్ అధికారిగా వివిధ సేవలు అందించిన శంకరన్‌తో తమ అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఆర్భాటాలు, హంగులకు దూరంగా మెలిగిన అధికారి శంకరన్ అని కీర్తించారు. హోదా ఉందని తోటి వారిని బెదిరించి పనులు చేయించడం, లబ్ధి పొందడం వంటివి ఆయన డిక్షనరీలో లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులుగా పని చేస్తున్న విశ్రాంత ఐఏఎస్ అధికారి విజయకుమార్ మాట్లాడుతూ గుర్తేడు గ్రామం నుండి శంకరన్ అప్పటి నక్సలైట్ల చేత కిడ్నాప్ అయిన విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు. తనను అట్టిపెట్టుకుని మిగతావారిని వదిలేస్తే వారి డిమాండ్‌లు అన్నీ పూర్తి అవుతాయని చెప్పడం ఆయన మానవీయ కోణానికి నిదర్శనమన్నారు. మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ శంకరన్ గిరిజనులతో విశేషంగా మమేకమయ్యేవారని ప్రశంసించారు. జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ నెల్లూరు కలెక్టర్‌గా పని చేసినప్పుడు అక్కడి నిరుపేదలకు అందించిన సేవలకు ఈనాటికీ శంకరన్ పేరును స్మరించడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతో విభేదాలు వచ్చి త్రిపుర రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శిగా వెళ్లిన శంకరన్ రిక్షాలో కార్యాలయానికి వెళ్లడానికి సిద్ధమయ్యారని ఇది ఆయన నిరాడంబరతకు నిదర్శనమన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రచురించిన ‘శంకరన్ స్మృతిలో’ పుస్తకాన్ని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆవిష్కరించారు. మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సబ్ కలెక్టర్ హెచ్‌ఎం ధ్యానచంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సునీత, ప్రవీణ్‌కుమార్, చక్రపాణి, వెంకటరామిరెడ్డి, రాబర్ట్ పాల్గొని శంకరన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
*చిత్రం... శంకరన్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మాట్లాడుతున్న సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం