ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ అరాచకాలను కట్టడి చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ దాష్టీకాలు, అరాచకాలను అడ్డుకోవాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో టీడీపీ కార్యకర్తలపై జరుగుతున్న వరుస దాడులు, ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమంగా పెడుతున్న కేసుల వివరాలను, మాటవినని వ్యక్తులు, వ్యవస్థలను వేధిస్తున్న తీరుని గవర్నర్ దృష్టికి టీడీపీ నేతలు తీసుకెళ్లారు. విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, వైవీబీ రాజేంద్రప్రసాద్, దీపక్‌రెడ్డి, ఎంవీ సత్యనారాయణరాజు, ఏఎస్ రామకృష్ణ, పోతుల సునీత, పీ అశోక్‌బాబు, ఎమ్మెల్యేలు మద్దాలి గిరిధర్, టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు మంగళవారం గవర్నర్‌ని కలిసి ఫిర్యాదు చేశారు.
టీడీపీ నేతల ఫిర్యాదును పరిశీలించిన గవర్నర్ వారు చేసిన విజ్ఞప్తులను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గవర్నర్‌ని కలిసిన అనంతరం విలేఖరులతో ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు కూడా కాలేదని, ఇటువంటి రాక్షసపాలన ఎప్పుడూ, ఎక్కడా చూడలేదన్నారు. దౌర్జన్యాలు, అరాచకాలు, దమనకాండలు, వేరే పార్టీ వారిని వేధించడం, వారిపై తప్పుడు కేసులు పెట్టడం చేస్తున్నారన్నారు. వీసీలను, ప్రొఫెసర్లను, రెక్టార్లను అందరినీ వేధించడం ఈ ప్రభుత్వానికే సాధ్యమైందన్నారు. ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ దామోదర్‌నాయుడిని కావాలనే ఎస్సీ, ఎస్టీ కేసులో ఇరికించారన్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలకు గవర్నర్ చాన్సలర్‌గా ఉంటే, అలాంటి గవర్నర్‌కే తెలియకుండా వీసీని అరెస్ట్ చేయడం చాలా దారణమన్నారు. ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి మాట్లాడుతూ పోలీసులు టీడీపీ కార్యకర్తలతో సహా, సానుభూతిపరులపై కూడా తప్పుడు కేసలు నమోదు చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుని మంత్రి కన్నబాబు వ్యక్తిగతంగా దూషించడాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, ఏఎస్ రామకృష్ణ, పోతుల సునీత్‌వైవీబీ రాజేంద్రప్రసాద్ తదితరులు మాట్లాడారు.

*చిత్రం... గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను మంగళవారం కలిసి ప్రభుత్వంపై ఫిఠ్యాదు చేస్తున్న టీడీపీ నేతలు