ఆంధ్రప్రదేశ్‌

ఆశాజనకంగా రబీ సాగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 22: ఈ ఏడాది రబీ ఆశాజనకంగాఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు స్పష్టం చేశారు. రైతులకు సకాలంలో ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో రబీ సాగుపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున రబీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని, ప్రభుత్వ పరంగా రైతులకు అవసరమైన సహకారాన్ని అందించాలని సూచించారు. రైతు భరోసా పంపిణీపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కౌలు రైతుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళిక రూపొందించిందని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రబీ సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. వర్షాభావ ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పంటల సాగు పట్ల రైతులకు అవగాహన కల్పించాలన్నారు. రుణాల మంజూరులో జాప్యం లేకుండా బ్యాంకర్లతో సంప్రతింపులు జరపాలన్నారు.

*చిత్రం... అధికారులతో సమీక్షిస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు