ఆంధ్రప్రదేశ్‌

అర్చకుల కలలు సాకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: దేవాలయాలను నమ్ముకుని ఉన్న అర్చకుల కలలు సాకారం చేస్తూ వంశపారంపర్య హక్కుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రంలోని దేవాలయాల్లో ధూపదీప నైవేద్యాలకు రూ. 234 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ. 100 కోట్లు కేటాయించారన్నారు. మంగళవారం బ్రాహ్మణవీధిలోని జమ్మిదొడ్డిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు మల్లాది విష్ణుతో కలిసి వారు మాట్లాడారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి దేవాదాయ శాఖ చట్టం 33/2007 కింద అర్చకుల వంశపారపర్య హక్కుల కోసం ప్రతిపాదిస్తూ చర్యలు తీసుకున్నారన్నారు. అయితే తదుపరి ప్రభుత్వాలు వాటి అమలుకు చర్యలు తీసుకోకపోగా నిర్లక్ష్యంగా వ్యవహరించాయన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత అర్చకుల ఇబ్బందులు, దేవాలయాల స్థితిగతులపై అధ్యయన కమిటీ వేశారన్నారు. ఈ కమిటీ మూలాలలోకి వెళ్లి తగు సిఫార్సులు చేసిందన్నారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే అర్చకులకు ఇచ్చిన వంశపారంపర్య హక్కును పరిరక్షించేలాగా ఉత్తర్వులను జారీ చేశామన్నారు. దేవాలయాల్లో ధూప, దీప, నైవేద్యాల కోసం అందించే మొత్తాన్ని ఐదు వేల రూపాయల నుంచి పది వేల రూపాయలకు పెంచే దిశలో ప్రభుత్వం అడుగులు వేస్తున్నదన్నారు. బ్రాహ్మణ అర్చక ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే మూడు రోజుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ క్షేమాన్ని కాంక్షిస్తూ విశేష అర్చనలు, పూజలు పెద్ద ఎత్తున చేపడతామన్నారు.

*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రి వెలంపల్లి, ఎమ్మెల్యే విష్ణు