ఆంధ్రప్రదేశ్‌

రాజ్యాధికారంతోనే బీసీల అభ్యున్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 20: రాజ్యాధికారం ద్వారానే బీసీలు అభివృద్ధి సాధించగలరని, ఇప్పటివరకు జనాభాలో సగభాగం పైగా ఉన్న బీసీలను రాజకీయ పార్టీలు వాడుకుని వదిలేశాయని వక్తలు అన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు అధ్యక్షతన నగరంలో ఆదివారం ‘బీసీల రాజకీయ మేధోమథన సదస్సు’ జరిగింది. విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ చంద్రకుమార్, బాలయోగి మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 72సంవత్సరాలు గడచినా నేటికీ బీసీలు అణచివేతకు గురౌతూనే ఉన్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నా జనాభాలో సగభాగం పైగా ఉన్న బీసీలకు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ప్రముఖ హీరో, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ మేమెంతో.. మాకంత నినాదంతో బీసీలు ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. జనాభా దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కావాలని, ఓట్లు మావే.. సీట్లు మావేనన్నారు. తక్షణమే రాజ్యాధికార పార్టీ పెట్టాలని సూచించారు. రాజ్యాధికారం ప్రజల సొత్తు అని, తప్పకుండా సాధిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్ర బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఇప్పటివరకు ప్రభుత్వాలు బీసీలకు రాయితీలు మాత్రమే ఇచ్చాయని, అవికాదని, రాజకీయ అధికారం కావాలన్నారు. సభకు అధ్యక్షత వహించిన శంకరరావు మాట్లాడుతూ బీసీలకు రాజ్యాంగపరంగా వచ్చే హక్కులు ఇవ్వడం లేదని, ఆయా రాజకీయ పార్టీలు మన హక్కులను హరించివేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి వైస్ చైర్మన్, ఉద్యానవన శాఖ అధికారుల సంఘం అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, మాజీ శాసనమండలి సభ్యుడు ఐలాపురం వెంకయ్య, మాజీ మేయర్ తాడి శకుంతల, తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం...సదస్సులో మాట్లాడుతున్న కేశన శంకరరావు