ఆంధ్రప్రదేశ్‌

నేడో, రేపో బోటు వెలికితీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 20: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం వద్ద గత నెల 15వ తేదీన సుడిగుండంలో చిక్కుకుని బోల్తా పడిన రాయల్ వశిష్ఠ పున్నమి బోటు వెలికితీతకు మార్గం సుగమమయ్యింది. విశాఖపట్నం నుంచి వచ్చిన పది మంది డైవర్లు ఆదివారం నుంచి రంగంలోకి దిగారు. శివశక్తి అండర్ వాటర్ డైవర్ సర్వీస్ బృందానికి చెందిన సుమారు పదిమంది స్కూబా డైవర్లు బోటు వెలికితీత పనుల్లో పాల్గొంటున్నారు. ఆదివారం కచ్చులూరు వద్ద భారీ వర్షంలో సైతం ధర్మాడ సత్యం బృందం, విశాఖ నుండి వచ్చిన డైవర్స్ బృందం బోటు వెలికితీత పనులు కొనసాగించారు. బోటు వెలికితీత పనులు రెండో దపా మొదలై ఐదవ రోజులుగా కొనసాగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నానికల్లా బోటును వెలికి తీయగలమని బాలాజీ మెరైన్ సంస్థ, శివశక్తి అండర్ వాటర్ డైవింగ్ సర్వీస్ బృందం ప్రతినిధులు తెలిపారు. దీనితో సోమ, మంగళవారాల్లో బోటు వెలికితీత ఖాయమని తెలుస్తోంది. విశాఖ నుండి వచ్చిన బృందంలో దాసు, నాగరాజు అనే ప్రధాన డైవర్లు బోటువున్న ప్రాంతంలో ఆక్సిజన్ మాస్క్‌లు ధరించి ఎయిర్ కంప్రషర్ సహాయంతో గోదావరి అడుగు భాగానికి వెళ్ళి బోటు చూట్టూ ఇనుప రోప్‌ను బిగించారు. బోటు 40 అడుగుల లోతులో ఉండటంతో ఇద్దరూ నీటి అడుగు భాగానికి వెళ్లగలిగారు. కాకినాడ పోర్టు అధికారి ఆదినారాయణ, ధర్మాడ సత్యం పర్యవేక్షణలో శివశక్తి అండర్ వాటర్ డైవింగ్ సర్వీస్ బృందంలో ప్రధానమైన దాసు, నాగరాజు, రెండు సార్లు బోటు వున్న ప్రాంతానికి వెళ్ళివచ్చారు. అనంతరం ఎలా బయటకు తీయాలో అనే విషయమై అందరితో చర్చించారు. గోదావరిలోకి దిగి రోప్‌ను బోటు చుట్టూ బిగించి వచ్చే సమయంలో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు భారీ వర్షం కురిసింది. అయినా పనులు ఆగలేదు. అయితే సాయంత్రం వరకు ఒక్క రోప్‌ను మాత్రమే బోటు చుట్టూ బిగించగలిగారు. సోమవారం ఉదయం బోటు వద్దకు వెళ్ళి బోటు చుట్టూ మరో ఇనుప రోప్‌ను బిగిస్తామని శివశక్తి అండర్ వాటర్ డైవింగ్ సర్వీస్ దాసు, నాగరాజు చెప్పారు. ఈ సమయంలోనే బోటులో వున్న చిన్నారికి సంబంధించి అస్థిపంజరం బయటకు వచ్చింది. దీనికి తలభాగం లేదు. ఈ అస్థిపంజరం ఎవరిదో గుర్తించాల్సివుంది.
ఇంకా 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది
కాగా బోటు ప్రమాదంలో గల్లంతైన వారిలో ఇంకా పదిమంది ఆచూకీ తెలియాల్సివుంది. ప్రమాదంలో 77 మంది చిక్కుకోగా 26 మంది సురక్షితంగా బయటపడ్డారు. శనివారం వరకు 40 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆదివారం బోటు వెలికి తీత సమయంలో ఒక చిన్నారి అస్థిపంజరం బోటు నుంచి బయటపడింది.
*చిత్రం... బోటు వెలికితీత పనుల్లో పాల్గొన్న విశాఖ డ్రైవర్లు