ఆంధ్రప్రదేశ్‌

పల్లెల్లో ఎల్‌ఈడీ వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో ఎల్‌ఈడీ వీధిదీపాల అమరికను ప్రత్యేక ప్రజాహిత కార్యక్రమంగా తీర్చిదిద్దుతామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ఎల్‌ఈడీ వీధి దీపాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజల్లో భద్రతా భావం పెరుగుతుందని స్పష్టం చేశారు. వీధిదీపాల నిర్వహణలో ఫిర్యాదులు రాకుండా చూడాలని, నూరుశాతం వీధిలైట్లు వెలుగులు విరజిమ్మాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో నిర్మాణాత్మక కార్యాచరణ రూపొందించుకుని అంకితభావంతో పనిచేయాలని ఉద్ఘాటించారు. గ్రామీణ ప్రాంతాల్లో వౌలిక సదుపాయాలను కల్పించి పట్టణాలతో సమానంగా పల్లెలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఈవిషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. పట్టణాలతో సమానంగా పల్లెల్లోనూ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని చెప్పారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని తెలిపారు. ఎల్‌ఈడీ దీపాలను మార్చటంలో జరుగుతున్న జాప్యంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాహితమే తమ ప్రభుత్వ అభిమతమని తెలిపారు. రాష్ట్రంలో ఎల్‌ఈడీ వీధిదీపాల నిర్వహణ సక్రమంగా ఉంటేనే గ్రామాల్లో ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. సీఎం జగన్ గ్రామస్వరాజ్యం పరిఢవిల్లేలా చేయాలని తాపత్రయపడుతున్నారని, ఇందుకు అందరి భాగస్వామ్యం అవసరమన్నారు. నిర్వహణ సంస్థలు గతంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం పనిచేసి పల్లెప్రజల ఆదరాభిమానాలు పొందాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో నూరు శాతం వీధిదీపాలు వెలగాల్సిందేనని అన్నారు. ఆ దిశగా సమష్టిగా పనిచేయాలని నిర్దేశించారు. ఇందుకోసం పంచాయతీరాజ్, ఈఈఎస్‌ఎల్ (కేంద్ర ఇంధన సామర్థ్య సంస్థ), ఇంధన శాఖ అధికారులతో సమన్వయంతో వ్యవహరించాలని, ఇందుకు సంబంధించి వీధిదీపాలు నూరుశాతం పనిచేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు.
ఎల్‌ఈడీ వీధిదీపాల నిర్వహణపై ఆదివారం తిరుపతి నుంచి మంత్రి పెద్దిరెడ్డి సంబంధిత అధికారులతో టెలీఫోన్‌లో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు. ప్రభుత్వం గ్రామీణ ప్రాంత అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్ర ప్రగతి సాధ్యపడుతుందనేది సీఎం ప్రగాఢ విశ్వాసమన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 2న తూర్పుగోదావరి జిల్లాలో సచివాలయ వ్యవస్థను ప్రారంభించారని గుర్తుచేశారు. సచివాలయ వ్యవస్థను పల్లె ప్రజలకు అండగా నిలిపి సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేశారన్నారు. పల్లెల్లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ దీపాలు వెలగటంలేదని, రాత్రిళ్లు ప్రజలు ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులకు ఇకపై స్వస్తి పలకాలని స్పష్టం చేశారు. పట్టణాలకు దీటుగా పల్లెల్లో కూడా ఎల్‌ఈడీ వెలుగులు చూడాలన్నారు. 2019 జనవరి నుంచి మొదలు ఈ నెల 15 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌ఈడీ దీపాలకు సంబంధించి 8.6 లక్షల ఫిర్యాదులు అందాయని తెలిపారు. మొత్తం దీపాల్లో
ఇది 32.2 శాతంగా ఉంటుందన్నారు. ఈఈఎస్‌ఎల్ వివిధ జిల్లాల్లో 22.51 లక్షల వీధిదీపాలను అమర్చినట్లు అధికారులు వివరించారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఎల్‌ఈడీ వీధిదీపాలపై వచ్చే ఫిర్యాదులను 72గంటల్లో పరిష్కరించి వాటి నిర్వహణను మెరుగుపరచాల్సి ఉంటుందని చెప్పారు. కానీ ఆయా జిల్లాల్లోని నిర్వహణ సంస్థలు ఆమేరకు పనిచేస్తున్న దాఖలాలు కనిపించటటం లేదన్నారు. ఈ నెల 15నాటికి 15,704 ఫిర్యాదులు మాత్రమే పరిష్కరించాల్సి ఉందని, ఈఈఎస్‌ఎల్ (కేంద్ర ఇంధన సామర్థ్య సంస్థ) అధికారులు చెప్పారు. ఎల్‌ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేసిన నాటి నుంచి వివిధ జిల్లాల్లో ప్రజల నుండి ఫిర్యాదులు వస్తున్నాయని, కొత్తగా ఏర్పాటు చేసిన దీపాలు వెలగడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. జిల్లాల్లో నిర్వహణ సంస్థల పనితీరును పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. వీధిదీపాల నిర్వహణ సంస్థలు అవసరమైన సిబ్బందిని నియమించలేదని, ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో కూడా అనర్హులు ఉన్నట్లు తేలిందని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. దీనివల్లే నిర్వహణ లోపాలు తలెత్తుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఎల్‌ఈడీ వీధిదీపాల నిర్వహణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారిస్తోందని తెలిపారు. ఇకపై నూరుశాతం వీధిలైట్లు వెలిగేందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకెళ్లాలని మంత్రి ఆదేశించారు. ఎల్‌ఈడీ వీధీదీపాలు పూర్తిస్థాయిలో పనిచేసేందుకు చిత్తూరు, కడప జిల్లాలను మోడల్‌గా ఎంపిక చేసి వెంటనే కార్యరూపంలోకి తేవాలన్నారు. ముందు ఈ రెండు జిల్లాల్లో ఫిర్యాదులు రాకుండా నెలలోపే పరిష్కరించాలని సూచించారు. మరమ్మతులు చేయటంతో పాటు గ్రామస్థాయిలో వౌలిక సదుపాయాలను వృద్ధిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. పాత లైట్ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేయటంతో పాటు ఫిర్యాదుల పరిష్కారానికి మండల స్థాయిలో కనీసం నలుగురు సిబ్బందిని నియమించుకోవాలని, దీనివల్ల నిర్వహణ మెరుగుపడటంతో పాటు ఫిర్యాదులు శూన్య స్థితికి వస్తాయని వివరించారు. ఎల్‌ఈడీ వీధిదీపాల నిర్వహణ ప్రత్యేకంగా పర్యవేక్షించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగిస్తామన్నారు. సంబంధిత ఏజెన్సీలతో సమన్వయం చేసుకుని నిర్వహణ అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు. రాష్టవ్య్రాప్తంగా 24.05 లక్షల ఎల్‌ఈడీ వీధిదీపాలను ఏర్పాటు చేయాలనేది లక్ష్యం కాగా 23.90 లక్షలు ఏర్పాటు చేసినట్లు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. వీటిలో ఈఈఎస్‌ఎల్ 22.51 లక్షలు ఏర్పాటు చేయగా నెడ్‌క్యాప్ 1.54 లక్షలు ఏర్పాటు చేసిందని చెప్పారు. 6.36 లక్షల లైట్లు మాత్రమే 21,245 సీసీఎంఎస్ జంక్షన్ బాక్స్‌లతో అనుసంధానం చేసినట్లు వివరించారు. ప్రజలు పంచాయతీల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించేందుకు కేంద్రీకృత ఫిర్యాదుల నిర్వహణ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని ద్వివేది సూచించారు. వీధిలైట్ల నిర్వహణ మెరుగుపరిచేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుందని చెప్పారు. నూరుశాతం ఎల్‌ఈడీ వీధిదీపాలు పనిచేసేలా చూసి గ్రామాల్లో ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు.

*చిత్రం...మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి