ఆంధ్రప్రదేశ్‌

కారుణ్య నియామకాలను పునరుద్ధరించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), అక్టోబర్ 20: పోలీసు శాఖలో రద్దయిన కారుణ్య నియామకాలను పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈమేరకు నగరంలో డీజీపీ దామోదర గౌతం సవాంగ్‌ను అసోసియేషన్ ప్రతినిధి బృందం సభ్యులు కలిశారు. పోలీసులకు వారాంతపు సెలవు ఇచ్చి ఒత్తిడి తగ్గించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ హోం గార్డుల సంక్షేమంపై దృష్టి పెట్టి జీతాలు పెంచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాగా విద్యాభాస్యం పూర్తయిన వెంటనే పోలీసుల పిల్లలకు అర్హతకు తగ్గట్లుగా కారుణ్య నియామక ఉత్తర్వులను పునరుద్ధరించాలని సంఘం ప్రతినిధులు డీజీపీకి విజ్ఞప్తి చేశారు. పోలీసు శాఖలో పనిచేసే సిబ్బంది మరణిస్తే కుటుంబంలో భార్యకు గాని, పిల్లలకు గాని ఉద్యోగమిచ్చే విధానం గతంలో ఉండేదని, అందుకు సంబంధించి రద్దయిన జీఓను మళ్లీ తీసుకొచ్చి పోలీసుల పిల్లలకు అవకాశమివ్వాలని కోరారు. పోలీసు అమరవీరుల పిల్లలకు మెడిసిన్ తరహాలో ఇంజనీరింగ్ కౌనె్సలింగ్‌లోనూ రిజర్వేషన్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. విధినిర్వహణలో మరణించిన పోలీసు సిబ్బంది కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో లక్ష నుంచి 5లక్షల రూపాయలకు పెంచాలని, ఉచిత బస్‌పాసులు, ఆరోగ్య భద్రతా కార్డులు మంజూరు చేయాలని అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జే శ్రీనివాసరావు, ప్రతినిధి బృందం డీజీపీకి అందజేసిన వినతిపత్రంలో కోరారు.
*చిత్రం... డీజీపీ సవాంగ్‌ను కలిసిన పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు