ఆంధ్రప్రదేశ్‌

రివర్స్ టెండరింగ్ పేరిట రియాల్టీ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 20: రాష్ట్రంలో ప్రస్తుతం రివర్స్ టెండరింగ్ పేరుతో రియాల్టీ షో నడుపుతున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గడచిన ఐదేళ్లలో 73,622 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరిగాయని, ఏమీలేకపోయినా ప్రస్తుత పాలకులు గత నాలుగు నెలల పాలనపై జబ్బలు చరుచుకుంటున్నారని ధ్వజమెత్తారు. పోలవరంలో ఇంతవరకు ఒక్క బొచ్చ సిమెంట్ వేయలేదని, ఒక తట్ట మట్టి కూడా ఎత్తలేదన్నారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పనులన్నీ హైకోర్టు చుట్టూ తిరుగుతున్నాయని ఎద్దేవా చేశారు. ఈ నాలుగు నెలల్లో పెండింగ్ బిల్లులను ఎవరెవరికి ఇచ్చారో చెప్పే ధైర్యం, దమ్ము పాలకులకు ఉన్నాయా అని ఆయన ప్రశ్నించారు. గోదావరిలో బోటు మునిగి నెల ఐదు రోజులైతే, రాష్ట్రం మునిగి నాలుగు నెలలు అయిందన్నారు. గతంలో తాము గోదావరి గర్భంలో 300 అడుగుల లోతులో కొండరాయిని పట్టుకుని డయాఫ్రమ్ వాల్ కట్టామని గుర్తుచేశారు. ఇక సీఎం జగన్‌కు ఢిల్లీ పర్యటనలతోనే కాలం సరిపోతోందన్నారు. ఢిల్లీ ఎందుకు వెళుతున్నారో మీడియా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా? అని ప్రశ్నించారు. రైతు భరోసా కింద వచ్చే సొమ్ము రైతుల ఖాతాలకు జమకావటం లేదని, డబ్బులు పడనప్పుడు మళ్లీ మెసేజ్‌లు ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వైకాపా కార్యకర్తలు మద్యం విక్రయిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఇవన్నీ మాట్లాడకూడదనే జీవో 938 తీసుకొచ్చారన్నారు. పాలకుల కనుసన్నల్లోనే వేలాది ఇసుక లారీలు హైదరాబాద్, బెంగళూరు వెళుతున్నాయని దేవినేని ఉమా ఆరోపించారు.