ఆంధ్రప్రదేశ్‌

పరిపూర్ణ విద్యాలయాలుగా పాఠశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, అక్టోబర్ 19: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను పరిపూర్ణ విద్యాలయాలుగా మార్చబోతున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పాఠశాలల భవన నిర్మాణాలకు కేటాయించిన రూ.1500 కోట్లలో ఒక్కపైసా కూడా దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు. అత్యంత నాణ్యతా ప్రమాణాలతో భవనాల నిర్మాణం చేపడతామని మంత్రి పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఇంజినీరింగ్ అధికారులకు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగునెలల పాలనలో విద్యాశాఖకు పెద్దపీట వేశారన్నారు. పేద, బడుగు, బలహీనవర్గాలు అనే తేడాలేకుండా ప్రతి ఒక్కరు ఉన్నత చదువులు చదవాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమన్నారు. ‘మనబడి’, ‘నాడు-నేడు’ కార్యక్రమాల ద్వారా విద్యావ్యవస్థను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. నవంబర్ 14న ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభిస్తారని, ఇందుకోసం మొదటి విడత రూ.1500 కోట్లు పాఠశాలల భవన నిర్మాణాలకు కేటాయించారన్నారు. ఈ నిధులలో ఒక పైసా కూడా దుర్వినియోగం కాకుండా అన్ని వౌళిక వసతులకు ఖర్చు చేస్తామని ఆయన అన్నారు. అవినీతి రహిత పాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు.
విద్యాశాఖను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు రూ.23 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించారని అన్నారు. ఇంజినీరింగ్ అధికారులు అంకితభావంతో, ఉద్యమస్ఫూర్తితో పనిచేసి నిర్దేశిత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ విద్యాలయాల్లో అన్ని వౌళిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సంబంధించి 30 లక్షల ఫొటోలు తీయించామని అన్నారు. ఈ పాఠశాలలకు వౌళిక వసతులు కల్పించి వాటి రూపురేఖలు మార్చబోతున్నామన్నారు. ముఖ్యంగా ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు, నిరంతర నీటి సౌకర్యం, రంగులు, ప్రహరీలు, బల్లలు, బ్లాక్‌బోర్డుల వంటి వసతులు కల్పిస్తామన్నారు. పేరెంట్స్ కమిటీల ద్వారా ‘నాడు-నేడు’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలుచేయబోతున్నామన్నారు.ప్రతి సంవత్సరం జనవరిలో డీఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి అన్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సిలబస్ మార్చే ఆలోచనలో ఉన్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, విద్యాశాఖ అడ్వైజర్ మురళి, ఏపీఇడబ్ల్యుఐడీసీ ఎండీ మురళి, ఆర్‌జేడీ వెంకట కృష్ణారెడ్డి, డీఇవో శైలజ, ఎస్‌ఎస్‌ఏ పివో ప్రభాకర్‌రెడ్డి, కడప ,కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

*చిత్రం...కడపలో శనివారం పాఠశాల విద్యాశాఖ ఓరియంటేషన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న విద్యాశాఖ మంత్రి సురేష్