ఆంధ్రప్రదేశ్‌

వెంపర్లాటే తప్ప పశ్చాత్తాపం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 19: ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడిలో తప్పు చేశానన్న పశ్చాత్తాపం నేటికీ ఏ మాత్రం కన్పించడంలేదని, అయితే ఆయన రాజకీయ భవిష్యత్ కోసం మళ్లీ తమతో జత కట్టేందుకు వెంపర్లాడుతున్నట్లుగా ప్రచారం సాగుతున్నదని భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు అన్నారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శనివారం జరిగిన మీట్ ది ప్రెస్‌లో జీవీఎల్ ఓవైపు తమ పార్టీ విధానాలను వివరిస్తునే ప్రాంతీయ పార్టీలకు ఇక భవిష్యత్ లేదంటూ తేల్చి చెప్పారు. అసలు ఇక చంద్రబాబులో ఏమి మిగిలి ఉందని మేము ఆలోచించాలని ప్రశ్నించారు. ప్రజలు టీడీపీని పూర్తిగా వదిలేశారన్నారు. ఈ స్థితిలో తాము ఆక్సిజన్ ఇచ్చి ఆయనను ఉద్ధరించాల్సిన అవసరం లేదన్నారు. అసలు ఏనాడైనా చంద్రబాబు ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి కాగలిగారా అన్నారు. ఇప్పటికే తాము రెండు సార్లు చంద్రబాబుకు అధికార పగ్గాలు అప్పగించి తప్పు చేశామన్నారు. ఇక భవిష్యత్‌లో అలా జరగబోదన్నారు. కేంద్ర ఆర్థిక మాజీ మంత్రి చిదంబరం, కర్నాటకలో శివకుమార్ లాంటి జాతీయ ఉద్ధండుల ప్రస్తుత పరిస్థితి చూసి చంద్రబాబు భయపడుతున్నాడనేది తానెలా చెప్పగలమన్నారు. ఏది ఏమైనా ప్రధాని మోదీ అవినీతిపరులకు ఎన్నడూ రక్షణ కల్పించబోరని స్పష్టం చేశారు. చంద్రబాబు ఇటీవల బీజేపీతో తనకు సైద్దాంతక విభేదాలేవీ లేవన్నారంటూ అసలు ఆ పార్టీకి ఒక సిద్ధాంతమంటూ ఉంటే కదా
అని ఎద్దేవా చేశారు. ఆయన వన్నీ అవకాశవాద రాజకీయాలేనన్నారు. రాజ్యసభలో తమకుబలం అవసరం కాబట్టే నలుగురు టీడీపీ సభ్యులను చేర్చుకున్నామన్నారు. అయితే అది ఫిరాయంపు కాదు... విలీనం మాత్రమేనని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. లోక్‌సభలో తమ పార్టీకి 303 మంది సభ్యులున్నారు. ఇక అలాంటప్పుడు టీడీపీకి చెందిన ఆ ముగ్గురు సభ్యులతో తమకేమి పని అన్నారు. ఒక వేళ అనుకుంటే ఆ ముగ్గురు కూడా ఏనాడో చేరి ఉండే వారన్నారు. ఈ దేశంలో బలమైన కాంగ్రెస్ పార్టీ క్రమేపీ నీరసబడుతుంటే ఏపీలో పూర్తిగా కనుమరుగయిందన్నారు. అందుకే తమ సిద్ధాంతాలు, మోదీ పాలన చూసి ఇక్కడి ప్రజలు టీడీపీ, వైకాపాలకు చరమగీతం పాడి తమను అధికారంలోకి తీసుకురావాలన్న ఉత్సాహంతో ఉన్నారన్నారు. హర్యానా, త్రిపురలో ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి రాలేదా అన్నారు. కర్నాటక అలాగే ఒడిస్సాలో బలపడుతున్నామన్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు వస్తే నాలుగు నెలల్లోనే నాలుగు ఎంపీ సీట్లు సాధించుకోలేదా అన్నారు. ఏదైనా సాధ్యం కాగలదన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానాలో తిరిగి రెండోసారి అధికారం చేపట్టబోతున్నామని అన్నారు. అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టులలో అవినీతి జరిగిందని చెబుతున్న సీఎం జగన్ గడచిన నాలుగు మాసాల్లో అలాంటి అవినీతిపరులపై ఎలాంటి చర్య లేకుండా నాన్చుడు ధోరణి ఎందుకు అవలంబిస్తున్నారని ప్రశ్నించారు. రాజధాని ఎక్కడనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం... తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రజల ఆకాంక్షల కనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అసలు రాజధాని నిర్మాణానికి అవసరమైన డబ్బును కేంద్రం సమకూరిస్తే చంద్రబాబు గ్రాఫిక్స్ చూపించడం వల్ల రాజధాని ఎక్కడ అన్నదానిపై నేడు అపోహలు చెలరేగుతున్నాయన్నారు. రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు ప్రభుత్వానికి కూడా మంచిది కాదంటూ హితవు చెప్పారు. ఇటు ప్రభుత్వం అటు డీజీపీ సమగ్ర విచరాణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు.

*చిత్రం...మీట్ ది ప్రెస్‌లో మాట్లాడుతున్న బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు