ఆంధ్రప్రదేశ్‌

ముగిసిన ఐటీ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరదయ్యపాళ్యం: కల్కి ఆశ్రమానికి భక్తులు ఇచ్చిన విరాళాలలను దారి మళ్లిస్తున్నారని, పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని తమిళనాడు ఐటీ అధికారులకు అందిన ఫిర్యాదుల నేపథ్యంలో గత మూడు రోజులుగా జరుగుతున్న సోదాలు శనివారం ముగిశాయి. కల్కి ఆశ్రమంలోని 8 బ్లాకుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. రూ. 500 కోట్లకు పైగా లెక్కచూపని నగదు, బంగారాన్ని ఐటీ అధికారులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతున్నా, అధికారులు ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. గత మూడు రోజులుగా జరిగిన సోదాలపై అధికారులు నివేదికను సిద్ధం చేశారు. శనివారం రాత్రి చెన్నైకి బయలుదేరారు. ఈ సందర్భంగా కల్కి ఆశ్రమంలో ఆర్థిక లావాదేవీలను, పరిపాలనా అంశాల్లో కీలకపాత్ర పోషించే సుమారు 10 మంది ఆశ్రమ సిబ్బందిని ఐటీ అధికారులు తమ వెంట తీసుకువెళ్లినట్లు సమాచారం. వారిని విచారించడం ద్వారా మరిన్ని
విషయాలు వెలుగులోకి రావచ్చనే ప్రచారం జరుగుతోంది. కాగా కల్కి ఆశ్రమంలో జరిగిన దాడులపై సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం స్పందిస్తూ ఆశ్రమ నిర్వాహకులు పలు అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని, వీటిపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మేరకు ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.