ఆంధ్రప్రదేశ్‌

తనిఖీలు జరపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: దీపావళి పండుగ నేపథ్యంలో బాణసంచా తయారీ కేంద్రాల్లో జరుగుతున్న దుర్ఘటనలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తయారీ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గడచిన 20 రోజుల్లో రెండు భారీ ప్రమాద ఘటనలపై శనివారం మంత్రి కురసాల కన్నబాబుతో పాటు అధికారులతో కలసి సమీక్షించారు. తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం జి వేమవరం గ్రామంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై ఆరా తీశారు. తయారీ కేంద్రాల్లో ఏవైనా లోపాలు ఉంటే వెంటనే సీజ్ చేయాలని, అన్ని అనుమతులను పరిశీలించాలన్నారు. ఫైర్, పోలీస్ శాఖలు సమన్వయంతో వ్యవహరించి అన్ని అనుమతులను క్షుణ్ణంగా పరిశీలన జరపాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారిని ఉపేక్షించేది లేదని, కఠినంగా వ్యవహరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తయారీ, నిల్వల కేంద్రాలు, అమ్మకాల వద్ద భద్రతా ప్రమాణాలపై నిఘా ఉంచాలని పోలీస్ ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. వేమవరం ప్రమాద ఘటనలో బాధితులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మంత్రి కన్నబాబు హామీ ఇచ్చారు.