ఆంధ్రప్రదేశ్‌

బ్లాక్ మార్కెట్‌కు ఇసుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 19: వైసీపీ ప్రభుత్వ విధానాలు ప్రజలకు మేలు చేయకపోగా, మరిన్ని కొత్త సమస్యలను తెచ్చి పెడుతున్నాయని టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు విమర్శించారు. శనివారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ ప్రవేశపెట్టి 46 రోజులు దాటినప్పటికీ ప్రజలకు ఇంతవరకు ఇసుక అందుబాటులోకి రాలేదన్నారు. బ్లాక్‌మార్కెట్‌లో మాత్రం ఇసుక వెల్లువెత్తుతోందన్నారు. 5 యూనిట్ల ఇసుక 30 నుండి 40 వేల రూపాయలకు అమ్ముతున్నారని, ఇదెలా సాధ్యమైందని మండిపడ్డారు. గతంలోని ఇసుక పాలసీని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయడం వల్ల సరిదిద్దుకోలేని తప్పు చేసినట్లయిందని ఆరోపించారు. ఈ పాలసీ భవన నిర్మాణ కార్మికుల జీవితాలు చిత్తు చేసిందని, ఆన్‌లైన్‌లో ఇసుక కోసం బుకింగ్ సౌలభ్యం కల్పించామని ఓ పక్క చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పూర్తి విరుద్ధంగా ఉందన్నారు. ఏపీ ఎండీసీ ఎండి స్వయంగా ఆన్‌లైన్‌లో బుక్‌చేసినా ఇసుక వచ్చే పరిస్థితి లేదన్నారు. టీడీపీ హయాంలో 5 యూనిట్ల ఇసుక 5 వేల రూపాయలకు వస్తే ఇప్పుడు ఇదే ఇసుక 40 వేల రూపాయలకు బ్లాక్ మార్కెట్‌లో కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.