ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ కొత్త బస్సులకు రూ.1000 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: కాలంచెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులను 1000 కోట్ల రూపాయలతో ఏపీఎస్ ఆర్టీసీ కొనుగోలు చేయనుంది. ఈ మొత్తాన్ని రుణంగా సమకూర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఆర్టీసీ 11,920 బస్సులను నడుపుతోంది. ఇందులో 3677 బస్సులు 10లక్షల కిలోమీటర్ల మేర తిరిగాయి. దీంతో ఆ బస్సులను ఆర్టీసీ సేవల నుంచి తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికితోడు పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్య, డిమాండ్‌కు అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాల్సి ఉంది. కాలంచెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి కొనాలని ఆర్టీసీ నిర్ణయించింది. అయితే ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో రుణం ఇచ్చేందుకు బ్యాంక్‌లు ముందుకు రావడం లేదు. దీంతో ప్రభుత్వం గ్యారంటీ ఇస్తే రుణం ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది. 1000 కోట్ల రూపాయలను 8.95 శాతం వడ్డీతో ఇచ్చేందుకు ఆ బ్యాంక్ సుముఖత వ్యక్తం చేసింది. దీంతో ఆర్టీసీకి రుణం లభించేందుకు వీలుగా ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చేందుకు అంగీకరించి, ఈమేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రుణాన్ని మాత్రం ఆర్టీసీ తన సొంత నిధుల నుంచి చెల్లించాల్సి ఉంటుంది.