ఆంధ్రప్రదేశ్‌

సమస్యలు పరిష్కరించండి..అవసరమైన నిధులు ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 16: సమస్యల పరిష్కారంపై మీరు దృష్టి పెట్టండి.. నిధుల కొరత లేకుండా చూస్తామని అధికారులకు రాష్ట్ర స్ర్తి, శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. బుధవారం సచివాలయం 3వ బ్లాక్‌లో రాష్ట్రంలోని 13 జిల్లాల డైరెక్టర్లు, ఎన్జీవో ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రధానంగా విభిన్న ప్రతిభావంతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై మంత్రి సమీక్షించారు. స్ర్తి, శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి ఈ సందర్భంగా జిల్లాల డైరెక్టర్ల పనితీరును వివరించారు. జిల్లాల్లో స్పందన కార్యక్రమం ద్వారా విభిన్న వర్గాల నుంచి వస్తున్న సమస్యల పరిష్కార మార్గాలను ఆయా జిల్లాల డైరెక్టర్లు మంత్రి దృష్టికి తెచ్చారు. స్పందనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టమైన వైఖరితో ఉన్నారని మంత్రి గుర్తుచేశారు. 2019-20 బడ్జెట్ కేటాయింపులో దివ్యాంగుల కార్పొరేషన్‌కు కేటాయించిన నిధులు సక్రమంగా వినియోగించాలని మంత్రి వనిత సూచించారు. ప్రభుత్వం నుంచి అవసరమైన నిధులు విడుదల చేయిస్తామని విభిన్న ప్రతిభావంతులకు మానవతా దృక్పథంతో సహకరించాలని కోరారు. ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, వారి ఆశలను వమ్ము చేయకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. అన్ని జిల్లాల్లో విభిన్న ప్రతిభావంతులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారిని చైతన్య పరచాలని కోరారు. ప్రభుత్వం తరుపున అందే సహాయాన్ని వివరించాలన్నారు. వివిధ ప్రమాదాలకు గురై అయినవారి సహకారంలేక బయట తిరగలేక ఇతరులపై ఆధారపడి ఇబ్బంది పడుతున్న వారిని గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న రుణాల ద్వారా ఆదుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందించటం వల్ల సంతోష జీవనానికి బాటలు వేసినట్లవుతుందన్నారు. సేవాభావంతో పనిచేయటం వల్ల కుటుంబానికి మేలు చేసిన ఆనందం ఉద్యోగుల్లో కలగాలన్నారు. ప్రభుత్వం విడుదలచేసే నిధుల కోసం నిరీక్షించకుండా రాష్టవ్య్రాప్తంగా ఎన్జీవోలు నిర్వహిస్తున్న వృద్ధాశ్రమాలను సందర్శించాలని సూచించారు. అక్కడ వృద్ధుల అవస్థలను గుర్తించి ఎన్జీవో సంస్థలకు మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. వృద్ధులు పింఛన్ పొందిన మొదటి నాలుగు రోజులు బాగా చూసుకుని తరువాత వారి బాగోగులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి వారిపై ప్రత్యేక దృష్టి సారించి వృద్ధుల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. వృద్ధులు, ట్రాన్స్ జెండర్‌లు, విభిన్న ప్రతిభావంతుల సమస్యలపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి అవకాశం ఉన్నంత వరకు పరికరాలను అందించాలని ఇందుకోసం ఎన్జీవోల సహకారం తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో స్ర్తి, శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ జీసీ కిషోర్ కుమార్, సంబంధిత శాఖ అధికారులు, డైరెక్టర్లు పాల్గొన్నారు.
*చిత్రం...అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి వనిత