ఆంధ్రప్రదేశ్‌

విలేఖరి హత్యపై పూర్తి స్థాయి దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, అక్టోబర్ 16: తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆంధ్రజ్యోతి విలేఖరి సత్యనారాయణ హత్యపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఈ ఘటనపై బుధవారం ఆయన కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో విలేఖర్లతో మాట్లాడారు. ఘటన జరిగిన వెంటనే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. ఈ విషయమై సీఎం సీరియస్‌గా స్పందించారని, తక్షణమే పూర్తి స్థాయి దర్యాప్తునకు డీజీపీని ఆదేశించారని తెలిపారు. త్వరలోనే నిందితులను గుర్తించి వారికి శిక్ష పడేలా చూస్తామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు. సత్యనారాయణ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పేర్ని నాని తెలిపారు.