ఆంధ్రప్రదేశ్‌

అర్ధాకలితో అలమటిస్తున్నాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 16: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు నెలలుగా తమకు వేతనాలు చెల్లించక పోవడంతో అర్ధాకలితో అలమటిస్తున్నామని పశుసఖి డ్వాక్రా మహిళలు బుధవారం ప్రతిపక్ష నేత చంద్రబాబును కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నారు. గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పశుసఖి డ్వాక్రా మహిళలు వెళ్లి చంద్రబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. మీ ప్రభుత్వ హయాంలో మహిళలు స్వయం ఉపాధి కోసం ఎన్నో చర్యలు తీసుకున్నారని, ప్రస్తుతం తమకు నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వక పోవడంతో మంత్రి మోపిదేవి వెంకట రమణను కలిస్తే కాంట్రాక్టు అయిపోయిందని, వేరే పనులు చూసుకోవాలని అంటున్నారని పశుసఖి డ్వాక్రా సంఘాల నేతలు లక్ష్మీ సామ్రాజ్యం, రాజకుమారి, భారతి వాపోయారు. స్పందించిన చంద్రబాబు గ్రామాల్లో పాడి పరిశ్రమ ద్వారా మహిళల స్వావలంబన కోసం పశుసఖిలను గోపాలమిత్ర లేని చోట నియమించామన్నారు. ప్రభుత్వం లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని ప్రచార ఆర్భాటం చేసుకుంటూ ఉన్న ఉద్యోగాలను తొలగించడం సరికాదని పేర్కొన్నారు.

*చిత్రం...చంద్రబాబుకు సమస్యలు విన్నవిస్తున్న మహిళలు