ఆంధ్రప్రదేశ్‌

ప్రజలకు మీరే అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: సమాజంలో ఎదురయ్యే అనేక సవాళ్లను ఎదుర్కొని ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత పోలీసులదేనని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఎస్‌పీ ఆరో బెటాలియన్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న 2018 బ్యాచ్ డీఎస్పీల పాసింగ్ ఔట్ పెరేడ్‌లో బుధవారం ముఖ్య అతిథిగా పాల్గొన్న సుచరిత మాట్లాడుతూ నవ్యాంధ్రలో మొదటి డీఎస్పీల పాసింగ్ ఔట్ పెరేడ్‌లో పాల్గొనటం ఆనందంగా ఉందంటూ, ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. 25 మంది డీఎస్పీల్లో 11 మంది మహిళలు ఉండటం అభినందనీయమన్నారు. పోలీసు యూనిఫాం ధరించి విధులు నిర్వర్తించేందుకు సిద్ధమైన డీఎస్పీలకు సుచరిత శుభాకాంక్షలు తెలిపారు. ఏ ఆపద వచ్చినా ముందుగా గుర్తొచ్చేది పోలీసులేనని, బాధ్యతలు తీసుకున్న డీఎస్పీలు పోలీసు శాఖ నమ్మకాన్ని నిలబెట్టాలన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల సమస్యలపై లోతైన అవగాహన కలిగి ఉండాలన్నారు. 70 శాతం జనాభా గ్రామాల్లో ఉన్నందున నిరంతరం ఆయా గ్రామాల్లో పర్యటించాలన్నారు. సున్నితమైన మహిళా సమస్యల పట్ల స్పందించి వారికి అండగా ఉండాలన్నారు. పెరుగుతున్న సైబర్ క్రైమ్, వైట్ కాలర్ నేరాలు, డ్రగ్స్ మాఫియాపై నిరంతర నిఘా ఉంచి వాటిని నిరోధించేలా కృషి చేయాలని సుచరిత కోరారు. పోలీసుల ఇబ్బందులు గుర్తించే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వీక్లీ ఆఫ్ ప్రవేశ పెట్టారని సుచరిత పేర్కొన్నారు.
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డీజీపీ
డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ వచ్చిన మంచి అవకాశాన్ని డీఎస్పీలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండి సమాజానికి సేవలందించాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులదే కీలక పాత్ర అన్నారు. సంఘ విద్రోహ శక్తుల దుశ్చర్యలపై కఠినంగా ఉండాలన్నారు. శారీరక దారుఢ్యంపై శ్రద్ధ పెట్టి ప్రతి ఒక్కరూ యాక్టివ్‌గా ఉండాలని, వివిధ కేసుల దర్యాప్తులో పూర్తి స్థాయి ఆధారాలు సేకరించేలా దృష్టి సారించాలన్నారు. సాంకేతికంగా, శాస్ర్తియంగా సాక్ష్యాలు సేకరిస్తేనే నిందితులకు శిక్షలు పడతాయని, మానవ హక్కుల ఉల్లంఘన, అంటరానితనం వంటి దురాచారాలు లేకుండా చూడాలని డీజీపీ కోరారు. కొత్త కొత్త కోణాల్లో వైట్ కాలర్ నేరాలు పెరుగుతున్నాయని, ఇటువంటి ఎన్నో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నారు. శిక్షణ పొందిన డీఎస్పీల చేత ఉన్నతాధికారులు ప్రతిజ్ఞ చేయించారు. హోంశాఖామంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబర్చిన సిబ్బందికి సుచరిత షీల్డులు అందజేశారు.

*చిత్రం... డీఎస్పీల పాసింగ్ ఔట్ పరేడ్