ఆంధ్రప్రదేశ్‌

త్వరలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు. బుధవారం సచివాలయంలోని తన కార్యాలయంలో మంత్రి గౌతంరెడ్డితో సింగపూర్ ప్రతినిధుల బృందం సమావేశమయింది. రాష్టవ్య్రాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసే అంశం సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. త్వరలోనే 25 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను ఏర్పాటుచేసి రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శిక్షణ అందించి పరిశ్రమల్లో స్వతహాగా వారికి వారే ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతున్నామని మంత్రి వివరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు అందించటానికే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. గతంలో ఏ శిక్షణ ఇవ్వకుండా కేవలం పారిశుద్ధ్య కార్మికుల తరహా కింది స్థాయి పనులు చేసే వారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని, ప్రస్తుతం ఆ విధానాలకు స్వస్తి చెప్పామన్నారు. నైపుణ్య శిక్షణ అందించి 75 శాతం స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించటం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనేదే తమ లక్ష్యంగా చెప్పారు. పారిశ్రామికవేత్తలతో స్నేహపూర్వకంగా ఉండే పారదర్శక విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల విషయంలో రాష్ట్ర
ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణతో వ్యవహరిస్తామన్నారు. స్పష్టమైన ప్రణాళిక రూపొందించి పరిశ్రమలకు అందిస్తామన్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాడులో పరిశ్రమలకు అవసరమైన వనరులన్నీ ఒకేచోట ఉండటం వల్ల ప్రోత్సాహకాల కంటే వసతులే ప్రామాణికంగా తీసుకుని చాలా కంపెనీలు తరలి వచ్చాయని గుర్తుచేశారు. ఏపీలోనూ ఇదే తరహా విధానాలను అవలంబిస్తామన్నారు. ప్రోత్సాహకాల కంటే ఏపీకి తలమానికమైన తీరప్రాంతం, పోర్టులు, విమానాశ్రయాలు వంటి సానుకూల అంశాలను ఉపయోగించుకుని వాటిని అనుకూలంగా మలచుకునే పరిశ్రమలకు మెరుగైన సదుపాయాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. దీనివల్ల ఎక్కువ శాతం యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఇందుకోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పరిశ్రమల శాఖ సలహాదారు కృష్ణ జివి గిరి, సింగపూర్ ప్రతినిథులు కేఎస్ ఇయాన్, చెంగ్ హాంగ్, సియాంగ్, టియో చీ హోవె, వెలరీ టియో, ఈస్తర్ టాన్ తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... మంత్రి మేకపాటి గౌతంరెడ్డితో భేటీ అయిన సింగపూర్ ప్రతినిధులు