ఆంధ్రప్రదేశ్‌

క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలి: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), అక్టోబర్ 15: తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం అత్యంత బాధాకరమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో క్షతగాత్రులైన వారికి మెరుగైన చికిత్స అందించడంతో పాటు బాధిత కుంటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని మంగళవారం ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పర్యాటకులు బస్సు ప్రమాదానికి గురికావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. అన్నవరం స్వామి వారి దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరగడం తనను ఎంతో ఆవేదనకు గురి చేసిందన్నారు. కచ్చలూరు పడవ ప్రమాదంలో 51 మంది గల్లంతైన దుర్ఘటన మరువక ముందే ఇప్పుడు ఘోర రోడ్డు ప్రమాదం జరగడం విచారకరమన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించి, మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.