ఆంధ్రప్రదేశ్‌

మహాత్ముని ఆశయసాధనే మోదీ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, అక్టోబర్ 15: మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న ఘనత ప్రధానమంత్రి నరేంద్రమోదీకే దక్కుతుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కర్నూలు నగరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కన్నా మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు పరిధిలో 150 కిలోమీటర్ల మహాత్మాగాంధీ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నామని చెప్పారు. 2014లో ప్రధానమంత్రిగా ఎన్నికైన నరేంద్రమోదీ ఇప్పటి వరకు దేశాభివృద్ధికి ఎంతో చేశారన్నారు. మోదీ ప్రధానమంత్రిగానే కాకుండా దేశ రక్షణ విషయంలో కాపలాదారుగా రాజీపడకుండా దృఢనిశ్చయంతో పనిచేస్తున్నారన్నారు. రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పిలుపుమేరకు మహాత్మాగాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
మహాత్మాగాంధీ సంకల్పయాత్ర ఈనెల 31వ తేదీ వరకు జరుగుతుందని, ప్రతి రోజు 15 కిలోమీటర్ల దూరం సంకల్పయాత్ర కొనసాగిస్తామని చెప్పారు. మహాత్మాగాంధీ సిద్ధాంతాలయిన అహింస, అంటరానితనాన్ని నిర్మూలించడం, ఖాదీవస్త్రాలు ధరించడం, పరిసరాల పరిశుభ్రత, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండటం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని చైతన్యవంతులను చేస్తామని వివరించారు. రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను త్వరితగతిన ఖర్చు చేసి ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఎంపీ కోరారు. మహాత్మాగాంధీ సంకల్పయాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
*చిత్రం... కర్నూలులో విలేఖరులతో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్