ఆంధ్రప్రదేశ్‌

గాంధీజీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, అక్టోబర్ 15: మహాత్మాగాంధీ 150 సంవత్సరాల జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకువెళ్ళేందుకు గాంధీ సంకల్ప యాత్రను నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల పట్టణంలోని ఎన్ ఆర్‌పిఎం హైస్కూల్ ఆవరణలో ఉన్న గాంధీజీ విగ్రహానికి మంగళవారం పూలమాలలు సమర్పించి సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ గాంధీజీ త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, ఆయన జీవితంలో మరచిపోలేని సంఘటనలను, ప్రదేశాలను ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నవ్యభారత నిర్మాణంలో పునరుజ్జీవన కల్పించేందుకు ఆయన సంకల్పస్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అయితే గత 5 సంవత్సరాలలో స్వచ్ఛ్భారత అభియాన్ పేరుతో అనేక సేవాకార్యక్రమాలు చేసినట్లు గుర్తుచేశారు. గాంధీజీ ఆశయాలకు, అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గత 5 సంవత్సరాలకాలంలో రూ. 9కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టడం గాంధీజీ స్ఫూర్తికారణమన్నారు. మహాత్మాగాంధీ స్ఫూర్తిని ఉద్యమస్ఫూర్తితో ముందుకు తీసుకువెళ్ళాలని, పార్టీలతో నిమిత్తంలేకుండా, రాజకీయాలకు అతీతంగా ఆయన్ని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టంచేశారు. గ్రామస్థాయినుంచే అభివృద్ధికి బాటలు వేయాలని, స్వదేశీ వస్తువులకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగాలు ఎన్నటికీ చిరస్మరణీయమన్నారు. కుల, మత ప్రాంతాలకు అతీతంగా చీరాల ప్రాంతంలో గాంధీ పర్యటన సాగిందని ఆయన వేటపాలెం సారస్వతనికేతన్ గ్రంధాలయంలో వదిలిన చేతికర్ర నేటికి ఎందరికో స్ఫూర్తిదాయకంగా ఉన్నదని అన్నారు. ఈ సంకల్పయాత్ర అక్టోబర్ 31వ తేదీ వరకు సాగుతుందని, దేశానికి గౌరవాన్ని, నిబద్థతను కలిగించేందుకు ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో పాల్గొని దేశ ఔన్నత్యానికి పాటుపడాలని కోరారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజల సంక్షేమంకోసం కట్టుబడి ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు పాల్గొన్నారు.