ఆంధ్రప్రదేశ్‌

ప్రాంతీయవాదానికి కాలం చెల్లింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగ్గయ్యపేట, అక్టోబర్ 15: దేశంలో ప్రస్తుతం ప్రాంతీయ వాదానికి కాలం చెల్లిందని కేంద్ర మాజీమంత్రి, బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలో మంగళవారం గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి గాంధీ సంకల్పయాత్రను ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ప్రాంతీయ పార్టీలతో ప్రయోజనం లేదన్నారు. అందరూ జాతీయవాదానికి మద్దతు ఇవ్వాలని పిలునిచ్చారు. దేశంలో అధికార వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం గాంధీ ఆశయమన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఆశయ సాధనకోసం కృషి చేస్తోందన్నారు. గ్రామ గ్రామాన ఈ ఆశయ సాధన లక్ష్యంగానే గాంధీ సంకల్పయాత్ర చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో చంద్రబాబు, వైఎస్ కుటుంబాల మధ్యే అధికారం ఉందన్నారు. టీడీపీ, వైసీపీలు దొందూదొందే అని వ్యాఖ్యానించారు. తాను ప్రాంతీయ వాదానికి గతంలో తాను మద్దతు ఇచ్చిన మాట వాస్తవమేనని, జాతీయవాదమే స్థిరమైనదని నేడు అనుభవంలోకి వచ్చిందన్నారు. అనంతరం జాతీయ జెండాలు చేతబూని పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నేతలతో కలిసి పట్టణంలో గాంధీజీ సంకల్పయాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నేతలతో పాటు స్థానిక నేతలు, తదితరులు పాల్గొన్నారు.

*చిత్రం... జగ్గయ్యపేటలో జరిగిన సభలో మాట్లాడుతున్న సుజనాచౌదరి