ఆంధ్రప్రదేశ్‌

ఇది వైఎస్సార్ రైతు నిరాశ పథకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), అక్టోబర్ 15: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ వలంటీర్లకు వేలల్లో జీతాలు ఇస్తున్న ప్రభుత్వం అన్నం పెట్టే రైతుకు మాత్రం వందల్లో సాయం చేస్తోందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్ రైతులనూ వదలకుండా వాయిదా పద్ధతిలో నిరాశ మిగిల్చారని మంగళవారం ట్విట్టర్ వేదికగా లోకేష్ ఎద్దేవా చేశారు. వాయిదా పద్ధతి సీఎం జగన్ అంటూ మీరు ప్రవేశపెట్టిన పథకం వైఎస్‌ఆర్ రైతు నిరాశ కార్యక్రమంగా మిగిలిందన్నారు. ఎన్నికల హామీలో రైతు భరోసాకింద రూ.12500 ఇస్తామని ప్రకటించి ఇప్పుడు కేవలం రూ.7500, అదీ మూడు వాయిదాల్లో ఇస్తూ రైతులకూ రివర్స్ టెండరేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మంది రైతులు ఉంటే వారిలో సగం మందిని తగ్గించుకుంటూ పోయారన్నారు. కులాన్ని చూడము అంటూనే ఓసీలైన కౌలు రైతులకు మొండి చెయ్యి చూపారన్నారు. పెట్టుబడి సాయం ఒకేసారి ఇస్తామని మాటిచ్చి విడతల్లో ఇస్తూ మడమ తిప్పారని ఎద్దేవా చేశారు. మీ పార్టీ వలంటీర్లకు నెలకు రూ.5,000 ఇస్తూ, ఆరుగాలం శ్రమించే అన్నదాతకు మాత్రం రూ.625 చొప్పున ఇవ్వడం న్యాయమా అంటూ వ్యాఖ్యానించారు.
చెప్పింది కొండంత .. చేసింది గోరంత
గుంటూరు: అధికారంలోకి వస్తే రైతులకు అది చేస్తాం, ఇది చేస్తాం అని ప్రగల్బాలు పలికి తీరా పీఠమెక్కాక రైతు భరోసా సాయానికి పెద్దమొత్తంలో కోత విధిస్తూ మరోసారి తడిగుడ్డతో రైతుల గొంతు కోశారని వైసీపీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు మండిపడ్డారు. రైతుల గురించి చెప్పింది కొండంత, చేసింది గోరంత మాత్రమేనని ఆక్షేపించారు. చివరకు రుణమాఫీ జీవో రద్దు చేసి రైతులను నిలువునా ముంచారన్నారు. మంగళవారం ఈ మేరకు గుంటూరులోని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నుండి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి కళా వెంకట్రావు ఓ లేఖ విడుదల చేశారు. బడ్జెట్‌లో 64.06 లక్షల మందికి పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చి, అమలులో 54 లక్షలకు కుదించి నమ్మకద్రోహం చేశారన్నారు. రైతులకు ఒకేదఫాలో 12,500 రూపాయలు ఇస్తామని 2017లో జరిగిన ప్లీనరీలో ప్రకటించారని, హామీపై నిలబడే వారైతే ఇప్పుడు కేంద్రం ఇస్తున్న 6 వేలతో పాటు రాష్ట్రం ఇచ్చే 12,500 కలిపి మొత్తం 18,500 రూపాయలు ఇవ్వాల్సి ఉందన్నారు.
నిబంధనల పేరుతో 10 లక్షల మంది రైతులకు అన్యాయం
అధికారంలోకి రాకముందు ప్రతి రైతుకి ఏటా మే నెలలోనే రూ.12,500లు ఇస్తామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తానే రైతులను ఉద్ధరిస్తున్నట్లు పైకి ఫోజులిస్తూ లోలోపల కోతలు విధిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్ ధ్వజమెత్తారు. మంగళవారం విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ నిర్వహించిన ప్లీనరీలో జగన్మోహన్‌రెడ్డి రైతులకు ఇచ్చిన హామీలను అధికారం చేపట్టాక తుంగలో తొక్కారన్నారు. జులై 9, 2017న గుంటూరులో జరిగిన వైసీపీ ప్లీనరీలో జగన్ చేసిన ప్రసంగంలో ఐదు ఎకరాల లోపు ఉన్న ప్రతి సన్న, చిన్నకారు పేద రైతులందరికీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఏటా మే నెలలోనే రూ.12,500లు అందజేస్తామని చెప్పి, నేడు రైతు భరోసా ప్రారంభం సందర్భంగా విడతల వారీగా కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద కేంద్రం ఇచ్చే 6 వేలను కలిపి ఇస్తున్నట్లు చెప్పటం దారుణమన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగా రైతు భరోసా పథకం కింద ఏటా మే నెలలో రూ.12,500లు చొప్పున 64.06 లక్షల మంది రైతులకు 15.36 లక్షల మంది కౌలు రైతులకు లబ్ధి చేకూరుస్తామని చెప్పి, నేడు మొత్తం 51 లక్షల మందికి ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం దారుణమన్నారు.
రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం
విజయవాడ: టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన రైతు రుణమాఫీ, అన్నదాత సుఖీభవ పథకాలను రద్దు చేసిన వైసీపీ ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేసిందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ధ్వజమెత్తారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు భరోసా పేరుతో రూ. 12,500 ఇస్తానని చెప్పి రూ. 7,500 మాత్రమే రైతులకు ఇస్తున్నారన్నారు.