ఆంధ్రప్రదేశ్‌

పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధిపై మార్గదర్శకాలు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: రాష్ట్రంలో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధికి సంబంధించి మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. ఈ చట్టం అమలుకు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ నోడల్ ఏజన్సీగా వ్యవహరిస్తుంది. రాష్ట్ర స్థాయి కమిటీకి కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. పరిశ్రమల శాఖ కమిషనర్ సభ్యునిగా, ఫ్యాక్టరీస్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్రంలో 10 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం నివాసం ఉన్నవారు స్థానికతకు అర్హులవుతారు. దీనిని ధ్రువీకరించేందుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటరు కార్డు, విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, గ్యాస్ కనెక్షన్, వంటివి తొమ్మిది రకాలు గుర్తింపు పత్రాల్లో ఒకటి ఉండాలి. ఏర్పాటు చేసే పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకు కేటాయించాలి. పరిశ్రమ ఏర్పాటు చేసే గ్రామం, నగరం, పట్టణాన్ని ముందుగా స్థానికతకు ప్రాతిపదికగా తీసుకోవాలి. ఆ ఉద్యోగాలకు తగిన అర్హులు లభించనప్పుడు మండలం, జిల్లా, జోన్, రాష్ట్రం ప్రాతిపదికగా నియామకాలు చేయాలి. ప్రతి త్రైమాసికంలో మొదటి 30 రోజుల్లో ఉపాధి వివరాలు సంబంధిత అధికారులకు తెలియచేయాలి.
రైతుల ఆత్మహత్యలపై ఆర్థిక సాయానికీ..
వ్యవసాయ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న రైతులకు 7 లక్షల రూపాయల మేర ఆర్థిక సాయం అందించేందుకు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం జారీ చేసింది. ఈ సాయం కింద కుటుంబ పునరావాస ప్యాకేజీ అందచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రైతుల ఆత్మహత్యలను విశే్లషించేందుకు మండల, డివిజన్ స్థాయి కమిటీలను ఏర్పాటు చేసింది. రైతు ఆత్మహత్య చేసుకున్న రోజునే విలేజ్ రెవెన్యూ అధికారి ఆ కుటుంబాన్ని సందర్శించాలి. మండల కమిటీ ఆ కుటుంబాన్ని సందర్శించి డివిజనల్ కమిటీకి 24 గంటల్లో ప్రాథమిక నివేదిక అందచేయాలి. వారం రోజుల్లోగా తుది నివేదిక అందచేయాలి. తప్పుడు క్లెయింలను నివారించేందుకు కమిటీ చర్యలు తీసుకోవాలి. రైతు ఆత్మహత్యకు వ్యవసాయ పరమైన కారణాలను నిరూపించాల్సి ఉంటుంది. కౌలు రైతు ఆత్మహత్య చేసుకుంటే, కౌలు ఒప్పందానికి సంబంధించి సాక్ష్యాలను సంపాదించాల్సి ఉంటుంది.