ఆంధ్రప్రదేశ్‌

ఉనికి కోసమే వర్ల తాపత్రయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 14: రాజకీయంగా తన ఉనికిని కాపాడుకునేందుకే టీడీపీ నేత వర్ల రామయ్య తాపత్రయపడుతున్నారని ఏపీ పోలీసు అధికారుల సంఘం నేతలు ఎన్ వెంకటరెడ్డి, మూర్తి గంగాధర్, దళవాయి సుబ్రమణ్యం, ఎం ప్రసాదరావు పేర్కొన్నారు. సోమవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు దశాబ్దాలకు పైగా పోలీసు శాఖలో పనిచేసి పెన్షన్ తీసుకుంటూ మాతృమూర్తిలాంటి పోలీసు వ్యవస్థపై, పోలీసు ఉన్నతాధికారులపై రామయ్య దిగజారుడు వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏనాడైనా పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం రామయ్య కృషి చేశారా అని ప్రశ్నించారు. వ్యవస్థపై అవగాహన ఉన్న రామయ్య హుందాగా వ్యవహరించాలే తప్ప తన స్థాయిని దిగజార్చుకునేలా వ్యాఖ్యలు చేస్తే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని వారు స్పష్టం చేశారు.