ఆంధ్రప్రదేశ్‌

రైతు భరోసా కొందరికేనా?: బుద్దా వెంకన్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: రాష్ట్రంలో రైతు భరోసా పథకం కొందరికేనా అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ప్రశ్నించారు. మంగళవారం నుంచి రైతుభరోసా పథకం ప్రారంభం కానుందంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన ఓ ట్వీట్‌పై బుద్దా ప్రతిస్పందించారు. శకుని మామా.. మీ తుగ్లక్ జగన్ ప్రతి రైతుకు రూ. 12,500 ఇస్తానన్నాడు.. అంటే 50 లక్షల మందికి ఇవ్వాల్సింది రూ. 6,250 కోట్లు, కానీ విడుదల చేసింది రూ. 5,510 కోట్లు అంటే రైతుభరోసా అందేది కొందరికేనా అని విమర్శించారు. రైతుకి ఇచ్చేది రూ. 6,500 అయితే కావాల్సింది రూ. 3,250 కోట్లే.. మరి మిగతా రూ. 2,260 కోట్లు ఎవరికి ఇస్తున్నారో.. జే టాక్స్ కింద జమా చేసినట్లే కదా.. అంటూ వెంకన్న ట్వీట్ చేశారు.