ఆంధ్రప్రదేశ్‌

నేడు పైడితల్లి సిరిమానోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం : ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పట్టణంలోని మూడులాంతర్ల వద్ద శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి సిరిమాను రథం బయలుదేరుతుంది. పాలధార, అంజలి రథం, అంబారి ఏనుగు, జాలరి వల రథానికి ముందు నడుస్తాయి. మూడు లాంతర్ల నుంచి కోట వరకు సిరిమాను రథం ముమ్మారు ప్రదక్షిణలు చేయనుంది. కోట వద్ద ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు వంశీయులను ఆశీర్వదించి తిరిగి మూడులాంతర్లకు చేరుకుంటుంది. 40 అడుగుల ఎత్తున్న సిరిమాను పీఠంపై ఆలయ పూజారి బంటుపల్లి వెంకట్రావు అమ్మవారి ప్రతిరూపంగా కూర్చుని భక్తులను ఆశీర్వదించనున్నారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు ఆంధ్ర రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణా, ఒడిశా, చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమబంగ తదితర సుదూర ప్రాంతాల నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. అందుకు తగిన విధంగా భద్రతా చర్యలు, వౌలిక సదుపాయాలను కల్పించడానికి చర్యలు తీసుకున్నారు.
భక్తి శ్రద్ధలతో తొలేళ్ల ఉత్సవం
సినిమానోత్సవం నిర్వహించే ముందు పైడితల్లి అమ్మవారికి సోమవారం తొలేళ్ల ఉత్సవాన్ని నిర్వహించారు. ఇప్పటికే విజయనగరం చేరుకున్న వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. సోమవారం ఉదయం నుంచే అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. రాత్రికి భక్తజనం మరింత పోటెత్తుతుందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తజనం రద్దీకి తగ్గట్టుగా సోమవారం అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తారు.
*చిత్రం... శ్రీ పైడితల్లి అమ్మవారు