ఆంధ్రప్రదేశ్‌

నవంబర్ 14 నుంచి నాడు-నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యా రంగంలో పాఠశాల స్థాయి నుంచి సమూల ప్రక్షాళనకు నిర్ణయించింది. ఇందులో భాగంగా నవంబర్ 14వ తేదీ నుంచి నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేయనుంది. వచ్చే నాలుగేళ్లలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడంతో పాటు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య నందించాలనేదే ఈ కార్యక్రమం లక్ష్యం. ఇందుకోసం ప్రతి ఏటా రూ. 15 వందల కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ. 6వేల కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రైవేట్ కాంట్రాక్టర్లతో నిమిత్తం లేకుండా కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ పద్ధతిని
దేశంలోనే తొలి సారిగా అమల్లోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రతి పాఠశాలను అభివృద్ధి చేయటంతో పాటు గత నాలుగేళ్ల క్రితం పాఠశాలల దయనీయ స్థితి.. ప్రస్తుత పరిస్థితులను ప్రజలకు వివరించే విధంగా నాడు- నేడు కార్యక్రమం నిర్వహించాలని నిర్దేశించారు. అవినీతికి ఆస్కారం లేకుండా ఉండేందుకు కమ్యూనిటీ కాంట్రాక్టింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.