ఆంధ్రప్రదేశ్‌

ఒక సిద్ధాంతమంటూ లేని చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: ఈ దేశంలో ఒక సిద్ధాంతమంటూ లేని రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు ఒక్కరేనని, యూటర్న్ అనే పదం వాడుకలోకి వచ్చిన తర్వాత ఆ పదాన్ని ఇప్పటిదాక లెక్కలేనన్ని సార్లు ఆచరణలో పెట్టిన ఘనత ఆయనదేనని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సోమవారం ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు. పచ్చి అవకాశవాదం... కాళ్ళు పట్టుకోవడం మినహా చంద్రబాబుకు ఒక సిద్ధాంతమంటూ లేదన్నారు. రైతు భరోసాతో బాబుకు నోరు పెగలడం లేదన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది రైతులు, కౌలు రైతులకు రైతుభరోసా కింద సీఎం జగన్ ఇప్పటికే రూ. 5510 కోట్లు విడుదల చేసారన్నారు. శాసనసభ్యులు, ఇన్‌చార్జిలు ప్రతి నియోజకవర్గ మండల, జిల్లా కేంద్రాల్లో మంగళవారం బాణసంచా కాల్చి పండుగ వాతావరణం కల్పించాలంటూ పిలుపునిచ్చారు.