ఆంధ్రప్రదేశ్‌

16 నుంచి సంకల్పయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 14: ఈ నెల 16 నుంచి 30 వరకు ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో మహాత్మాగాంధీ సంకల్పయాత్ర నిర్వహించనున్నట్టు ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ తెలిపారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నుంచి భీమిలి వరకు ఈ పాదయాత్ర ఉంటుందన్నారు. విశాఖ నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 150 కిలోమీటర్ల పాదయాత్రలో అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు. స్వచ్ఛ్భారత్, వన్ టైం ప్లాస్టిక్ వ్యతిరేక నినాదం, స్వదేశ వస్తు వినియోగం పెంచడం, స్థానిక స్వపరిపాలన నినాదాలతో ఈ పాదయాత్ర ఉంటుందన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా దీనిని చేపట్టామన్నారు. ప్రతి జిల్లాలో 150 కిలోమీటర్ల యాత్ర నిర్వహించాలని పార్టీ పిలుపునిచ్చిందన్నారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఈనెల 16న యాత్ర మొదలై 30తో భీమిలితో ముగుస్తుందన్నారు. మొత్తం 220 కిలోపమీటర్ల యాత్ర జరుగుతుందని, ముఖ్యంగా అయిదు ప్రధానాంశాలపై ప్రచారం చేస్తామన్నారు. స్వచ్ఛ్భారత్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకం మానివేయడం, భూగర్భ జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకు చెట్లు నాటడం, సురాజ్య, సుపరిపాలనకు ప్రజల భాగస్వామ్యం, స్వదేశీ వస్తు వినియోగం అనే అంశాలు ప్రచారం చేస్తామన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై జలశక్తిశాఖామంత్రిని కలసి సుదీర్ఘంగా చర్చించామన్నారు. ఆరు మాసాల నుంచి పోలవరం ప్రాజెక్టుకు సంబంధంచిన ఏ పనులు జరగడంలేదన్నారు. కేవలం ఏడు గ్రామాల ప్రజలకు మాత్రమే నివాసాలు చూపించిందన్నారు.
ప్రభుత్వం మారినపుడుల్లా గుత్తేదారులు మారడం వల్ల ప్రాజెక్ట్ ఆలస్యమవుతుందన్న విషయాన్ని తాము గ్రహించామన్నారు. దీనికి సంబంధించి దేశ ప్రధాని మోదీ కార్యాలయానికి కూడా ఒక నివేదిక పంపామన్నారు.
*చిత్రం...విలేఖరులతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్